ఘనంగా పురాణం సుబ్రహ్మణ్యశర్మ జయంతి - Hyderabad - EENADU
close

సోమవారం, సెప్టెంబర్ 16, 2019

ప్రధానాంశాలు

ఘనంగా పురాణం సుబ్రహ్మణ్యశర్మ జయంతి

వివేక్‌నగర్‌, న్యూస్‌టుడే: పురాణం సుబ్రహ్మణ్యశర్మ ఉన్నతశ్రేణి రచయిత, కథకుడు, సంపాదకుడు, విశ్లేషకుడు అని పలువురు కొనియాడారు. త్యాగరాయగానసభ ఆధ్వర్యంలో గురువారం కళాలలితకళావేదికలో సుబ్రహ్మణ్యశర్మ జయంతి నిర్వహించారు. అతిథులుగా ప్రముఖ హాస్యావధాని, వ్యంగ్య రచయిత, పాత్రికేయుడు, హాస్యబ్రహ్మ బిరుదాంకితుడు శంకరనారాయణ, ప్రసిద్ధ రచయిత, విమర్శకులు రమణ వెలమకన్ని హాజరయ్యారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్య శర్మ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. సుబ్రహ్మణ్యశర్మ ఆంధ్రజ్యోతి వారపత్రికకు దీర్ఘకాలంపాటు సంపాదకత్వం వహించారని, నూతన రచయితలను ప్రోత్సహించారని పేర్కొన్నారు. సుబ్రహ్మణ్యశర్మ పురాణం సీత పేరుతో రాసిన అనేక రచనలు బహుళప్రాచుర్యం పొందాయని తెలిపారు.  త్యాగరాయ గానసభ అధ్యక్షుడు కళాజనార్దనమూర్తి సభాధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా బృందావనం సంస్థ వ్యవస్థాపకుడు వై.సుబ్రహ్మణ్యం సారథ్యంలో గాయనీగాయకులు రేవతి, ప్రశాంతి, శ్రీకాంత్‌, తదితరులు  ప్రాచుర్యం పొందిన చిత్ర గీతాలను ఆలపించారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.