ముగిసిన అంతర్‌ జిల్లాల టెన్నికాయిట్‌ పోటీలు - Jagtial - EENADU
close

శుక్రవారం, సెప్టెంబర్ 20, 2019

ప్రధానాంశాలు

ముగిసిన అంతర్‌ జిల్లాల టెన్నికాయిట్‌ పోటీలు

విజేతలుగా హైదరాబాద్‌ క్రీడాకారులు

జ్యోతినగర్‌, న్యూస్‌టుడే: పెద్దపల్లి జిల్లా టెన్నికాయిట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో రామగుండంలో రెండు రోజులుగా జరుగుతున్న అంతర్‌ జిల్లాల టెన్నికాయిట్‌ పోటీలు ఆదివారం ముగిశాయి. తుది పోరులో హైదరాబాద్‌ క్రీడాకారులు ఘన విజయం సాధించారు. 5వ అంతర్‌ జిల్లాల టెన్నికాయిట్‌ పోటీలు ఎన్టీపీసీ టీటీఎస్‌లోని జిల్లా పరిషత్తు పాఠశాల క్రీడా మైదానంలో నిర్వహించారు. తెలంగాణ స్పోర్ట్స్‌ అథారిటీ, తెలంగాణ టెన్నికాయిట్‌ అసోసియేషన్‌ సౌజన్యంతో నిర్వహిస్తున్న పోటీల్లో 17 జిల్లాల క్రీడాకారులు పాల్గొన్నారు. ఆదివారం మొదటి సెషన్‌లో జరిగిన సెమీ-ఫైనల్‌లో పురుషుల విభాగంలో డి.వెంకటేశ్‌(హైదరాబాద్‌)-ప్రవీణ్‌(హైదరాబాద్‌) తలపడ్డారు. 21-12, 21-17 పాయింట్లు సాధించి వెంకటేశ్‌ గెలుపొందారు. ఎన్‌.తేజ్‌రాజ్‌(హైదరాబాద్‌), జి.అనిల్‌(హైదరాబాద్‌) మధ్య జరిగిన పోటీలో 21-17, 21-19 పాయింట్లతో తేజ్‌రాజ్‌ విజేతగా నిలిచారు. మహిళల విభాగంలో ప్రియాంక(హైదరాబాద్‌), హేమలత(వరంగల్‌ అర్బన్‌) తలపడగా, 21-17, 21-16 పాయింట్లతో ప్రియాంక విజేతగా నిలిచింది. శిరీష(హైదరాబాద్‌)-త్రిష(నిజామాబాద్‌) మధ్య జరిగిన పోటీలో 21-12, 21-16 పాయింట్లతో శిరీష గెలుపొందింది.

రసవత్తరంగా పోటీ: సాయంత్రం జరిగిన రెండో సెషన్‌లో జరిగిన ఫైనల్‌లో మహిళల విభాగంలో ప్రియాంక(హైదరాబాద్‌)-శిరీష(హైదరాబాద్‌) తలపడ్డారు. 21-14, 21-14 పాయింట్లతో ప్రియాంక విజేతగా నిలిచింది. పురుషుల విభాగంలో తేజ్‌రాజ్‌(హైదరాబాద్‌), వెంకటేశ్‌(హైదరాబాద్‌) మధ్య జరిగిన పోటీలో 21-10, 21-16 పాయింట్లు పొందిన తేజ్‌రాజ్‌ గెలుపొందారు. సెప్టెంబరు 12న బెంగళూరులో జరిగే దక్షిణ భారత స్థాయి పోటీలకు ఎన్‌.తేజ్‌రాజ్‌(హైదరాబాద్‌), డి.వెంకటేష్‌(హైదరాబాద్‌), బి.ప్రియాంక(హైదరాబాద్‌), కె.శిరీష(హైదరాబాద్‌)లతో పాటు ఎన్‌.ప్రవీణ్‌(హైదరాబాద్‌), జి.అనిల్‌(హైదరాబాద్‌), కె.హేమలత(వరంగల్‌), త్రిష(నిజామాబాద్‌), పూనంచందర్‌(వరంగల్‌), సుజయత్‌(మహబూబ్‌నగర్‌), ఎండి.యాసిన్‌(మహబూబ్‌నగర్‌), డి.ప్రకాశ్‌(వరంగల్‌), అనిత(మహబూబాబాద్‌), డి.నాగవేణి(నాగర్‌కర్నూల్‌), కె.గాయత్రి(జగిత్యాల), పి.మానస(జగిత్యాల)ను ఎంపిక చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. అక్టోబరు 2న దిల్లీలో సీనియర్‌ జాతీయ స్థాయి టెన్నికాయిట్‌ పోటీలు జరుగనున్నాయని చెప్పారు. పోటీల పరిశీలకులుగా సద్గురు వ్యవహరించారు. అనంతరం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో విజేతలకు పతకాలు, ధ్రువీకరణ పత్రాలు, జ్ఞాపికలు అందజేశారు. టెన్నికాయిట్‌ అసోసియేషన్‌ ప్రతినిధులను సత్కరించారు. కార్యక్రమంలో రాష్ట్ర టెన్నికాయిట్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి లక్ష్మీకాంతం, ఉపాధ్యక్షులు యాదయ్య, నిర్వాహక కార్యదర్శి లక్ష్మణ్‌, కోశాధికారి శ్యాంసుందర్‌, పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు గుండు కృష్ణమూర్తి, జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లె సురేందర్‌, నాయకులు తిరుపతియాదవ్‌, రాష్ట్ర వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం ఉపాధ్యక్షురాలు శోభారాణి, నగరపాలక మాజీ కో ఆప్షన్‌ సభ్యులు గౌస్‌పాషా, రామగుండం మండల విద్యాధికారి బి.డేనియల్‌, పీడీ కొమురోజు శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.