close

మంగళవారం, నవంబర్ 19, 2019

ప్రధానాంశాలు

ఆర్టీసీ కార్మికులను తొలగించే సత్తా ఎవరికీ లేదు

జాతీయ బీసీ కమిషన్‌ సభ్యుడు టి.ఆచారి


మాట్లాడుతున్న జాతీయ బీసీ కమిషన్‌ సభ్యుడు టి.ఆచారి

మహబూబ్‌నగర్‌ గ్రామీణం, న్యూస్‌టుడే : ఆర్టీసీ కార్మికులను తొలగించే సత్తా ఎవరికీ లేదని జాతీయ బీసీ కమిషన్‌ సభ్యుడు టి.ఆచారి పేర్కొన్నారు. వెంటనే ఆర్టీసీ కార్మికులను చర్చలకు పిలిచి వారి సమస్యలు పరిష్కరించకుంటే కేసీఆర్‌నైనా జాతీయ కమిషన్‌లు తమ ముందుకు పిలిపిస్తాయని స్పష్టం చేశారు. కేసీఆర్‌ చరిత్రలో చదువుకున్న నిరంకుశ పాలకులను తలపిస్తున్నారని అన్నారు. మహబూబ్‌నగర్‌లో ఆర్టీసీ ఐకాస ఆధ్వర్యంలో కొనసాగుతున్న కార్మికుల సమ్మెలో ఆచారి బుధవారం పాల్గొని మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన కార్మికులను అణిచివేసేందుకు ముఖ్యమంత్రి కుట్రలు చేయడం సరికాదన్నారు. కేసీఆర్‌ మాటలు నమ్మి 2018 ఎన్నికల్లో తెరాసకు ఆర్టీసీ కార్మికులు మద్దతు తెలిపితే ఇప్పుడు ముఖ్యమంత్రి ఓట్లువేసిన కార్మికులనే నిలువునా ముంచుతున్నారని విమర్శిఃచారు. ఇకనైనా ఆర్టీసీ కార్మికులు కేసీఆర్‌ పోకడలను గమనిస్తూ భవిష్యత్తు కార్యాచరణతో ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భాజపా సంపర్క్‌ అభియాన్‌ రాష్ట్ర ఛైర్మన్‌ కొండయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పడాకుల బాలరాజు, జిల్లా ఉపాధ్యక్షుడు వీరబ్రహ్మాచారి, నియోజకవర్గ కన్వీనర్‌ ఎ.అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.