శనివారం, డిసెంబర్ 07, 2019
కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: జిల్లాలోని నియోజకవర్గాల వారీగా పోలింగ్ కేంద్రాల మ్యాపింగ్, సెక్షన్ బౌండరీల ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి విజయానంద్ అన్ని జిల్లాల అధికారులను ఆదేశించారు. వెలగపూడి నుంచి ఆయన బుధవారం అన్ని జిల్లాల కలెక్టర్లు, ఈఆర్వోలతో వీడియోకాన్ఫరెన్స్‌లో సమీక్షించారు. పోలింగ్ స్టేషన్ పరిధిలో ప్రతి 40-100 కుటుంబాలను ఒక సెక్షన్ బౌండరీస్గా గుర్తించాలని, ఆ ఇళ్లల్లో ఉండే ఓటర్లను మ్యాపింగ్ చేయాలన్నారు. 1500 లోపు ఓటర్లను ఒక పోలింగ్ కేంద్రంగా గుర్తించాలన్నారు. పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఓటరు వెరిఫికేషన్ ప్రోగ్రామ్‌ను వంద శాతం పూర్తి చేయాలన్నారు. డిసెంబరు 12 నుంచి 2020 జనవరి 15 వరకు ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమంలో ఓటరు దరఖాస్తులను స్వీకరించాలన్నారు. నందికొట్కూరు నుంచి కలెక్టర్ జి.వీరపాండియన్, జిల్లా కేంద్రం నుంచి శ్రీశైలం ప్రాజెక్టు ప్రత్యేక కలెక్టర్ రామస్వామి, డీఆర్వో పుల్లయ్య, ఉప కలెక్టర్ సత్యం, డ్వామా, డీఆర్డీఏ పీడీలు వెంకటసుబ్బయ్య, ఎంకెవి శ్రీనివాసులు, కర్నూలు తహసీల్దారు కార్యాలయం నుంచి రెండో జేసీి ఖాజా మొహిద్దీన్, తహసీల్దారు తిరుపతిసాయి, ఈడీటీ జలాలుద్దీన్, తదితర రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
జిల్లా వార్తలు