close

మంగళవారం, డిసెంబర్ 10, 2019

ప్రధానాంశాలు

అమ్మాయి కోసం అమ్మ నగల చోరీ

కుమారుడిపై ఫిర్యాదు చేసిన తల్లి

అమీర్‌పేట, న్యూస్‌టుడే: ప్రేమించిన యువతి కోసం కన్నతల్లి కష్టపడి దాచుకున్న నగదు, నగలను చోరీ చేశాడో ప్రబుద్ధుడు. దీంతో తల్లి పోలీసులను ఆశ్రయించింది. ఎస్సార్‌నగర్‌ డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌ వై.అజయ్‌కుమార్‌ కథనం మేరకు.. బోరబండ ఎన్‌.ఆర్‌.ఆర్‌.పురానికి చెందిన లక్ష్మీదేవి, ఎల్‌.వి.ఎస్‌.ప్రసాద్‌ దంపతులు. అనంతపురంలో నివసించే ఓ బంధువు మృతి చెందడంలో వీరిద్దరు అక్కడికి వెళ్లారు. వీరి కుమారుడైన అరుణ్‌కుమార్‌(26) అదే బస్తీలో నివసించే ఓ యువతిని ప్రేమించాడు. తల్లిదండ్రులు లేని సమయం చూసి ఆమెతో వెళ్లిపోయేందుకు సిద్ధపడ్డాడు. ఇందుకు డబ్బు అవసరమని భావించి తల్లి లక్ష్మీదేవి ఇంట్లోని అల్మారాలో దాచుకున్న 8 తులాల బంగారు ఆభరణాలు, రూ.50వేల నగదును తీసుకుని వెళ్లిపోయాడు. ఊరు నుంచి వచ్చిన తల్లి.. కుమారుడితో పాటు నగదు, నగలు కనిపించకపోవడంతో అతని కోసం వాకబు చేసింది. తన కష్టార్జితాన్ని చోరీ చేసిన కుమారుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు అరుణ్‌కుమార్‌పై 420, 380 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.