close

ఆదివారం, జనవరి 26, 2020

ప్రధానాంశాలు

బడ్జెట్

వివాహమైన 14 రోజులకే వ్యక్తి..

దుండిగల్‌, న్యూస్‌టుడే: వివాహమైన 14 రోజులకే ఓ వ్యక్తి అదృశ్యమయ్యాడు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పరిధి మారుతినగర్‌కు చెందిన కె.రామ్మూర్తి కుమారుడు సతీష్‌ ఉద్యోగరీత్యా నగరానికి వచ్చి గండిమైసమ్మ చౌరస్తాలోని ఓ వసతిగృహంలో ఉంటున్నాడు. బాచుపల్లిలోని ఓ కంపెనీలో అతను పనిచేస్తున్నాడు. గత నెల 17న భూపాలపల్లికి చెందిన యువతితో అతడికి వివాహం జరిగింది. డిసెంబరు 1న గండిమైసమ్మ చౌరస్తాలోని వసతి గృహానికి తిరిగి వచ్చేశాడు. అద్దెకు ఇల్లు చూసిన తర్వాత భార్యను తీసుకెళ్తానని కుటుంబసభ్యులకు తెలిపాడు. ఈ క్రమంలోనే డిసెంబరు 2న మధ్నాహ్నం నుంచి అతడి చరవాణి స్విచ్ఛాఫ్‌ అయింది. అప్పటి నుంచి అతని ఆచూకీ లభించలేదు. అదే రోజు వసతిగృహం నుంచి అతను ఎవ్వరికి చెప్పకుండా వెళ్లిపోయినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ మేరకు అతని సోదరుడు గురువారం దుండిగల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.