close

బుధవారం, సెప్టెంబర్ 30, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

స్వచ్ఛంద లాక్‌డౌన్‌

సత్తుపల్లి సంగతులు

అవగాహన కల్పిస్తున్న ఏసీపీ ఎన్‌.వెంకటేశ్‌

 

సత్తుపల్లి, న్యూస్‌టుడే: సత్తుపల్లి పట్టణంలో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 11గంటల వరకే దుకాణాలు తెరిచి ఉంచేలా వ్యాపారులు నిర్ణయం తీసుకున్నారు. ● తాళ్లమడ గ్రాండ్‌ ఫర్నిచర్‌ దుకాణంలో యాజమాన్యం, సిబ్బందికి ఏసీపీ వెంకటేశ్‌ బుధవారం కరోనాపై అవగాహన కల్పించారు.

కల్లూరు గ్రామీణం, న్యూస్‌టుడే: లక్ష్మా తండాలో తలసేమియా పీడిత బాలల సహాయార్థం ఖమ్మం సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో బుధవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. కార్యక్రమాన్ని ఎల్‌.హెచ్‌.పి.ఎస్‌ జిల్లా ఆధ్యక్షులు ధశరథ్‌ నాయక్‌ ప్రారంభించారు. ● సున్నం రాజయ్య మృతి పట్ల మధిర మాజీ ఎమ్మెల్యే కట్టా వెంకటనర్సయ్య సంతాపం తెలిపారు.

తల్లాడ, న్యూస్‌టుడే: తల్లాడలోని ఎన్టీఆర్‌నగర్‌, కొడవటిమెట్ట(రెడ్డిగూడెం) గ్రామాల్లో కరోనా కేసులు నిర్ధారణ కావడంతో బుధవారం గ్రామాల్లో వైద్య, పంచాయతీ సిబ్బంది పారిశుద్ధ్య కార్యక్రమాలను నిర్వహించారు.

పెనుబల్లి, న్యూస్‌టుడే: లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ సప్తపది వీఎం బంజర్‌ ఆధ్వర్యంలో హమాలీ కార్మికులకు, ఆటో డ్రైవర్లకు బుధవారం మాస్కులు పంపిణీ చేశారు.

వేంసూరు, న్యూస్‌టుడే: వేంసూరు మండలంలో ఆంధ్రా సరిహద్దు గ్రామాల్లో ఇబ్బడిముబ్బడిగా వెలసిన మద్యం గొలుసుకట్టు దుకాణాల వల్ల కరోనా ముప్పు పెరుగుతోందని ఎంపీపీ పగుట్ల వెంకటేశ్వరరావు హెచ్చరించారు. మండల కార్యాలయంలో బుధవారం ప్రజాప్రతినిధులకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ● లింగపాలెంలోని హరిహర క్షేత్రం (శివాలయం, వెంకటేశ్వరాలయం) అభివృద్ధికి స్థానిక రైతు ఉడతనేని చంద్రరావు, రాణి దంపతులు రూ. 50,116 విరాళంగా అందించారు. ● జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులను బాండ్‌ విధానంలో నియమించడం చట్టవిరుద్ధమని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు మల్లూరు చంద్రశేఖర్‌ అన్నారు. పంచాయతీ విస్తరణాధికారి రంజిత్‌కుమార్‌కు వినతి పత్రం సమర్పించారు.

కల్లూరు, న్యూస్‌టుడే: కల్లూరుకు చెందిన జిల్లేళ్ల మహేష్‌ను బుధవారం ఖమ్మం జిల్లా మానవ హక్కుల మండలి వైస్‌ చైర్మన్‌గా నియమించారు. ● టీపీటీఎఫ్‌ నాయకులను తక్షణమే విడుదల చేయాలని కల్లూరులో నిర్వహించిన సమావేశంలో సంఘ జిల్లా అధ్యక్షుడు కె.రామారావు కోరారు. ● కల్లూరు లారీ, డీసీఎం యజమానుల నూతన కార్యవర్గాన్ని బుధవారం ఎన్నుకున్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.