close

శుక్రవారం, ఆగస్టు 14, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పరిశ్రమల్లో భద్రత ఏర్పాట్లు తప్పనిసరి

● నిబంధనలు అతిక్రమిస్తే కఠినచర్యలు

● కలెక్టర్‌

మాట్లాడుతున్న కలెక్టర్‌ వీరపాండియన్‌

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ సమావేశాన్ని కలెక్టర్‌ వీరపాండియన్‌ అధ్యక్షతన శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఏపీ రీస్టార్ట్‌ ప్యాకేజీ కింద సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయంతోపాటు పెండింగ్‌లో ఉన్న బకాయిలను అందిస్తూ పరిశ్రమల అభివృద్ధికి సహకారం అందిస్తోందని చెప్పారు. పెండింగ్‌లో ఉన్న 15 సింగిల్‌ డెస్క్‌ క్లియరెన్సు దరఖాస్తులను వెంటనే గడువులోగా పరిష్కరించాలన్నారు. జిల్లాలో 408 మంది పరిశ్రమలకు రూ.16.78 కోట్ల ప్రోత్సాహకాల మంజూరుకు కలెక్టర్‌ ఆమోదం తెలిపారు. రీస్టార్ట్‌ ప్యాకేజీ కింద జిల్లాలో మరో 25 పరిశ్రమలకు ప్రభుత్వ ఆర్థిక లబ్ధి కలిగించేలా దరఖాస్తులను పరిష్కరించారు. ఈ సమావేశంలో జేసీ-3 ఖాజా మొహిద్దీన్‌, ట్రైనీ అసిస్టెంట్‌ కలెక్టర్‌ నిధి మీనా, పరిశ్రమల శాఖ జీఎం సోమశేఖర్‌రెడ్డి, ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌ రామకృష్ణారెడ్డి, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి శ్రీనివాసరెడ్డి, వివిధ శాఖల అధికారులు, పరిశ్రమల యాజమాన్యాల ప్రతినిధులు పాల్గొన్నారు.

408 పరిశ్రమలకు రూ.16.78 కోట్ల ప్రోత్సాహకాలు:

జిల్లాలోని ఐదు భారీ రసాయన పరిశ్రమలు, మరో 42 ఇతర కర్మాగారాల నిర్వాహకులు తప్పనిసరిగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం భద్రత నియమాలు పాటించాలని కలెక్టర్‌ వీరపాండియన్‌ ఆదేశించారు. లేకుంటే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లా క్రైసిస్‌ గ్రూప్‌ కమిటీ సమావేశాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్నూలు మండలం గొందిపర్లలోని టీజీవీ ఎస్‌ఆర్‌ఏఏసీ, శ్రీ రాయలసీమ హైస్ట్రెంత్‌ హైపో సంస్థలు రెండు, కల్లూరు మండలం లక్ష్మీపురం సమీపంలోని ఎల్‌పీజీ బాటిలింగ్‌ యూనిట్‌, నంద్యాలలోని ఉడుములాపురంలో ఎస్పీవై ఆగ్రో లాంటి పరిశ్రమలు ఉన్నాయన్నారు. ఇటీవల ఎస్పీవై ఆగ్రోస్‌ కర్మాగారం వద్ద అమోనియా గ్యాస్‌ లీక్‌ జరిగిన నేపథ్యంలో జాయింట్‌ ఇన్‌స్పెక్షన్‌ కమిటీ అధికారులు జిల్లాలోని రసాయన పరిశ్రమలను తనిఖీ చేసి నివేదికలు ఇవ్వాలన్నారు. పరిశ్రమల యజమానులు ప్రభుత్వ నిబంధనలు, కాలుష్య నియంత్రణ మండలి నిర్దేశించిన అన్నిరకాల భద్రత చర్యలను తప్పనిసరిగా పాటించాలని పేర్కొన్నారు.

పాల్గొన్న వివిధ శాఖల అధికారులు, పరిశ్రమల యజమానులు

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.