శుక్రవారం, డిసెంబర్ 06, 2019
బాలికను ప్రేమించమని తిరుగుతున్న పోకిరీ అరెస్టు
మల్కాజిగిరి, న్యూస్టుడే: 9వ తరగతి చదువుకున్న బాలికను ప్రేమపేరుతో వేధిస్తున్న వ్యక్తిని సోమవారం బాధితురాలి కుటుంబసభ్యులు, పాఠశాల సిబ్బంది కలిసి పట్టుకుని మల్కాజిగిరి పోలీసులకు అప్పగించారు. పోలీసులు ఈ కేసును విచారించి అరెస్టు చేశారు. సంఘటనకు సంబంధించి ఎస్సై లింగస్వామి తెలిపిన వివరాల ప్రకారం.. ఠాణా పరిధిలో నివసించే బాలిక(13) 9వ తరగతి చదువుకుంటోంది. ఆమెను వాణినగర్కు చెందిన ప్రైవేటు ఉద్యోగి సాయిప్రసాద్(35) కొద్ది రోజులుగా వేధిస్తున్నాడు. ఆమెను ప్రేమిస్తున్నానని, తనప్రేమను ఒప్పుకోవాలని వెంటపడుతున్నాడు. బాలిక నిరాకరించడంతో ఆమెను అసభ్యపదజాలంతో దూషించడం ప్రారంభించాడు. విషయాన్ని ఆమె తన కుటుంబ సభ్యులు, పాఠశాల నిర్వాహక సిబ్బంది దృష్టికి తీసుకువెళ్లింది. సోమవారం పాఠశాలకు బయలుదేరిన సమయంలో ఆమె వెంట కుటుంబ సభ్యులు, పాఠశాల సిబ్బంది రహస్యంగా అనుసరించారు. ఆమె రాకను గమనించిన సాయిప్రసాద్ అసభ్యపదజాలంతో వేధించసాగాడు. వారిద్దరిని అనుసరిస్తున్న వస్తున్నవారు అతడ్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. బాధితురాలి తరఫున తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసును విచారించిన పోలీసులు అతడిపై పోక్సో కేసు నమోదు చేసి అరెస్టుచేసి రిమాండ్కు తరలించారు.
ప్రధానాంశాలు
జిల్లా వార్తలు