close

ప్ర‌త్యేక క‌థ‌నం

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ప్రత్యేక వ్యవస్థతోనే ప్రమాదాల నివారణ

దానికి నిపుణుడి నేతృత్వం అవసరం
గ్యాస్‌ నిల్వ ప్రాంతాలపై దృష్టిపెట్టాలి
‘ఈనాడు’తో ఆచార్య హరినారాయణ
ఈనాడు - ప్రత్యేక విభాగం

విశాఖలోని ఎల్‌జీ పాలిమర్స్‌ దుర్ఘటన లాంటి వాటిని భవిష్యత్తులో నివారించేందుకు నిపుణుడైన వ్యక్తి నేతృత్వంలో ప్రత్యేకమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రముఖ శాస్త్రవేత్త, గుజరాత్‌ ఇంధన పరిశోధన నిర్వహణ సంస్థ మాజీ డైరెక్టర్‌ జనరల్‌, ప్రొఫెసర్‌ టి.హరినారాయణ పేర్కొన్నారు. వాటిని కేంద్ర స్థాయిలో జాతీయ విపత్తు నియంత్రణ ప్రాధికార సంస్థ (ఎన్‌డీఆర్‌ఏ), రాష్ట్రస్థాయిలో ఎస్‌డీఆర్‌ఏగా వ్యవహరించాలన్నారు. దేశంలోని అన్ని పారిశ్రామిక, సాధారణ ప్రాంతాల్లో ప్రమాదాలకు ఆస్కారం గల సంస్థలను గుర్తించడం, అవి జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడమే ఆ వ్యవస్థ ప్రాధాన్యం కావాలన్నారు. అలాగే చమురు, గ్యాస్‌ ఆధారిత ప్రమాదాలే కాకుండా వరదలు, వరద నివారణా చర్యల వంటివి ఆ వ్యవస్థలో భాగంగా ఉండాలన్నారు. ఇందుకోసం ప్రభుత్వరంగంలోనూ, ప్రైవేటు విద్యా సంస్థల్లో గల మేధోశక్తిని ఎన్‌డీఆర్‌ఏ, ఎస్‌డీఆర్‌ఏ వినియోగించుకోవాలని హరినారాయణ సూచించారు. ఆయన ‘ఈనాడు’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలివీ..

ప్రస్తుతం దేశంలో పనిచేస్తున్న ప్రభుత్వ రంగ జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ (ఎన్‌డీఎంఏ), ఎస్‌డీఎంఏల ఆధ్వర్యంలోని రాష్ట్ర అత్యవసర నిర్వహణ కేంద్రం (ఎస్‌ఈఓసీ) వంటి సంస్థలు దుర్ఘటనానంతర చర్యలు చేపట్టడంలో నైపుణ్యం సాధించాయన్నారు. వీటికి నేతృత్వం వహిస్తున్న ఐఏఎస్‌ అధికారులకు పాలనాదక్షత, నిర్వహణ సామర్థ్యం ఉన్నప్పటికీ సాంకేతికాంశాలపై వారికి ఉండే పరిమితుల మేరకు విపత్తుల ముందస్తు అంచనాలు వేయలేరన్నారు. విశాఖలో జరిగిన ప్రమాదం అజాగ్రత్తకు ఓ ఉదాహరణ లాంటిదని, అది మనం అప్రమత్తం కావలసిన ఆవశ్యకతను తెలియజేస్తోందని పేర్కొన్నారు.


ప్రమాదాల నివారణకు సూచనలు..

* గుజరాత్‌ చేపట్టినట్లే ఆంధ్రప్రదేశ్‌లోనూ విస్తృత అధ్యయనం చేపట్టి, ప్రమాదకారక పరిశ్రమల జాబితాను రూపొందించాలి. ఆయా పరిశ్రమలు, కర్మాగారాల వద్ద అందుకు అనుగుణంగా భద్రతాచర్యలు బలోపేతం చేయాలి. ఇలాంటి చర్యలతో గుజరాత్‌లో ప్రమాదాలు బాగా తగ్గిపోయాయి.
* పరిశ్రమలకు సమీపంలో నివసించే పౌరులకు అక్కడ సంభవించే ప్రమాదాలు, ఆ సందర్భంగా తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలి.
* చమురు లీకేజీల కంటే గ్యాస్‌ లీకేజీలతో సంభవించే ప్రమాదాలు పదింతలు ఎక్కువ నష్టం కలిగిస్తాయి. కాబట్టి గ్యాస్‌ లీకేజీలకు అవకాశం ఉండే ప్రాంతాలు, గ్యాస్‌ నిల్వ ప్రాంతాలపై 10 రెట్లు ఎక్కువ దృష్టి పెట్టాలి.
* దేశంలో ప్రమాదావకాశాలు గల ప్రాంతాలను గుర్తిస్తే విపత్తులను తగ్గించగలం.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.