close

ఆంధ్రప్రదేశ్‌-లోక్‌సభా స్థానాలు

బాపట్ల లోక్‌సభ నియోజకవర్గం వివరాలు 

ఆవిర్భావం : బాపట్ల లోక్‌సభ నియోజకవర్గం 1977లో ఏర్పాటైంది. 
రిజర్వేషన్ : ఎస్సీ
ఈ నియోజకవర్గ పరిధిలో మొత్తం ఏడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. గుంటూరు జిల్లాలో బాపట్ల, వేమూరు, రేపల్లె అసెంబ్లీ స్థానాలు, ప్రకాశం జిల్లాలో చీరాల, పర్చూరు, అద్దంకి, సంతనూతలపాడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. బాపట్ల లోక్‌సభ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహించిన పాములపాటి అంకినీడు ప్రసాదరావు, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, దగ్గుబాటి పురందేశ్వరి, పనబాక లక్ష్మిలు కేంద్ర మంత్రులుగా పని చేశారు. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఈ స్థానాన్ని ఎస్సీలకు కేటాయించారు. 
2014 ఎన్నికల్లో వైకాపా అభ్యర్థి అమృతపాణిపై శ్రీరామ్‌ మల్యాద్రి 32,270 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. 

బాపట్ల లోక్‌సభ స్థానం నుంచి గెలుపొందిన అభ్యర్థులు వీరే!
* 1977-పి.అంకినీడు ప్రసాదరావు(కాంగ్రెస్‌)
* 1980- పి.అంకినీడు ప్రసాదరావు(కాంగ్రెస్‌)
* 1984-చిమటా సాంబు(తెలుగుదేశం)
* 1989- సలకల బెంజమిన్(కాంగ్రెస్‌)
* 1991-దగ్గుబాటి వెంకటేశ్వరరావు(తెలుగుదేశం)
* 1996- ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు(తెలుగుదేశం)
* 1998- నేదురుమల్లి జనార్ధనరెడ్డి(కాంగ్రెస్‌)
* 1999-దగ్గుబాటి రామానాయుడు(తెలుగుదేశం)
* 2004- దగ్గుబాటి పురందేశ్వరి(కాంగ్రెస్‌)
* 2009- పనబాక లక్ష్మి(కాంగ్రెస్‌)
* 2014-మాల్యాద్రి శ్రీరాం(తెలుగుదేశం)



మరిన్ని

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net