close

తెలంగాణ లోక్‌సభా స్థానాలు

మహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గం 

మహబూబ్‌నగర్‌ నియోజకవర్గం 1952లో ఏర్పాటైంది. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా అలంపూర్, గద్వాల, వనపర్తి శాసనసభా నియోజకవర్గాలు నాగర్ కర్నూలు లోక్‌సభ నియోజకవర్గంలో కలపగా, నాగర్ కర్నూలు నియోజకవర్గంలోని జడ్చర్ల, షాద్‌నగర్ శాసనసభ నియోజకవర్గాలు మహబూబ్‌నగర్‌లో కలిశాయి. 

రిజర్వేషన్: జనరల్
అసెంబ్లీ నియోజకవర్గాలు: కొడంగల్, నారాయణపేట,  మహబూబ్‌నగర్,  జడ్చర్ల,  దేవరకద్ర, మక్తల్, షాద్‌నగర్
2014 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు చెందిన జైపాల్‌రెడ్డిపై తెరాస అభ్యర్థి జితేందర్‌రెడ్డి 2,590 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. 

ప్రస్తుత ఎన్నికల్లో పాలమూరు జిల్లా నుంచి తెరాస అభ్యర్థిగా మన్నె శ్రీనివాసరెడ్డి పోటీ చేస్తున్నారు. సిట్టింగ్‌ ఎంపీ జితేందర్‌రెడ్డిని కాదని తెరాస అధిష్ఠానం శ్రీనివాసరెడ్డికి టికెట్‌ ఇచ్చింది. మరోపక్క కాంగ్రెస్‌ చల్లా వంశీచంద్‌రెడ్డిని బరిలోకి దింపింది. అనూహ్య పరిణామాల నేపథ్యంలో కాషాయ కండువా కప్పుకొన్న కాంగ్రెస్‌ నాయకురాలు డి.కె.అరుణ భాజపా తరపున ఎంపీగా పోటీ చేస్తుండటం విశేషం.

ఇప్పటి వరకు గెలిచిన అభ్యర్థులు
* 1957: జె.రామేశ్వరరావు(కాంగ్రెస్) 
* 1962: జె.బి.ముత్యాలరావు(కాంగ్రెస్) 
* 1967: జె. రామేశ్వరరావు(కాంగ్రెస్) 
* 1971: జె. రామేశ్వరరావు(కాంగ్రెస్) 
* 1977: జె. రామేశ్వరరావు(కాంగ్రెస్) 
* 1980: మల్లిఖార్జున్ (కాంగ్రెస్) 
* 1984: ఎస్. జైపాల్‌రెడ్డి(జనతాపార్టీ) 
* 1989: మల్లిఖార్జున్ (కాంగ్రెస్) 
* 1991: మల్లిఖార్జున్(కాంగ్రెస్) 
1996: మల్లిఖార్జున్(కాంగ్రెస్) 
* 1998: ఎస్. జైపాల్‌రెడ్డి(జనతాపార్టీ) 
* 1999: ఎ పి జితేందర్‌రెడ్డి(భాజపా) 
* 2004: డి విఠల్‌రావు(కాంగ్రెస్) 
* 2009: కె చంద్రశేఖర్‌రావు(తెరాస)
* 2014: జితేందర్‌రెడ్డి(తెరాస)



మరిన్ని

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net