నివేదిక వచ్చాకే శాశ్వత చర్యలు: ఆళ్ల నాని

తాజా వార్తలు

Published : 13/12/2020 02:08 IST

నివేదిక వచ్చాకే శాశ్వత చర్యలు: ఆళ్ల నాని

ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో అంతుచిక్కని వ్యాధికి గల కారణాలను నిర్ధారించేందుకు మరో 5 రోజుల సమయం పడుతుందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. పూర్తి స్థాయి విశ్లేషణ అనంతరం తుది నివేదిక వచ్చాకే నగరంలో శాశ్వత చర్యలు చేపడతామని చెప్పారు. ఏలూరులో అస్వస్థతకు గురైన బాధిత కుటుంబాలను మంత్రి శనివారం పరామర్శించారు. వారితో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆయా వీధుల్లో తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య పనులను పరిశీలించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రస్తుతం ఏలూరులో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. వ్యాధికి గల కారణాలపై జాతీయ సంస్థలు పరిశోధనలు సాగిస్తున్నాయని చెప్పారు. ఈ సంస్థలు తుది నివేదిక అందించిన అనంతరం వ్యాధికి కారణాలు వెల్లడిస్తామన్నారు. ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని మంత్రి భరోసా కల్పించారు. 

ఇవీ చదవిండి..
బాధితుల రక్తంలో ఆర్గానో క్లోరిన్‌, ఫాస్పరస్‌

అస్వస్థతకు కారణాలపై జవాబు దొరకని ప్రశ్నలెన్నో
 Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని