వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లకు హైకోర్టు అనుమతి

తాజా వార్తలు

Updated : 10/12/2020 20:21 IST

వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లకు హైకోర్టు అనుమతి

హైదరాబాద్‌: తెలంగాణలో వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లకు హైకోర్టు అనుమతి లభించింది. కంప్యూటర్ ఆధారిత పద్ధతిలో రిజిస్ట్రేషన్లు చేపట్టాలని ఉన్నత న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వ వినతి మేరకు వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై ఇవాళ విచారణ జరిపిన హైకోర్టు పలు సూచనలు చేస్తూ అనుమతిచ్చింది. రిజిస్ట్రేషన్‌ కోసం ముందుగా స్లాట్‌ బుకింగ్‌ చేసుకొనే విధానానికి అనుమతిచ్చింది. ఆస్తిపన్ను గుర్తింపు సంఖ్య కచ్చితంగా ఉండాలన్న నిబంధనకు న్యాయస్థానం సమ్మతించింది. రిజిస్ట్రేషన్ల సమయంలో ఆధార్‌, కులం, కుటుంబసభ్యుల వివరాలు అడగబోమని ప్రభుత్వం హైకోర్టుకు స్పష్టం చేసింది. రిజిస్ట్రేషన్లు ఆపాలని ఎప్పుడూ స్టే ఇవ్వలేదని విచారణ సందర్భంగా మరోసారి న్యాయస్థానం స్పష్టం చేసింది. అలాగే ధరణిపై ఇవాళ మరో ఐదు అనుబంధ పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిపై కౌంటర్‌ దాఖలు చేసేందుకు ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ బి.ఎస్‌.ప్రసాద్‌ హైకోర్టును గడువు కోరారు. ఈ మేరకు విచారణను ఈ నెల16కు ఉన్నత న్యాయస్థానం వాయిదా వేసింది.

ఇవీ చదవండి..
కడుపు నిండినంత ఆనందంగా ఉంది:హరీశ్‌రావు

పేరులోనే ఏదో బలముంది: కేసీఆర్‌
 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని