అమూల్‌ కోసం ప్రభుత్వ నిధులు వద్దు: హైకోర్టు

తాజా వార్తలు

Updated : 04/06/2021 18:21 IST

అమూల్‌ కోసం ప్రభుత్వ నిధులు వద్దు: హైకోర్టు

అమరావతి: అమూల్‌తో కుదిరిన ఎంవోయూపై ఈనెల 14 వరకు ఎలాంటి నిధులు ఖర్చు చేయవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏపీ హైకోర్టు ఆదేశించింది. అమూల్‌తో రాష్ట్ర ప్రభుత్వం  చేసుకున్న ఒప్పందాన్ని సవాల్‌ చేస్తూ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం ఈమేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. గుజరాత్‌లోని అమూల్‌ సంస్థతో పాటు నేషనల్‌ డెయిరీ డెవలప్‌మెంట్‌ బోర్డుకు నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది. ఒప్పందం పూర్తి వివరాలు ఇవ్వాలని అమూల్‌, డెయిరీ బోర్డును కోర్టు ఆదేశించింది. కేసు విచారణను ఈనెల 14కు వాయిదా వేసింది. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని