TS news: డీలర్ల కమిషన్‌ పెంపుపై చర్చ
close

తాజా వార్తలు

Published : 14/06/2021 20:47 IST

TS news: డీలర్ల కమిషన్‌ పెంపుపై చర్చ

హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త రేషన్‌ కార్డుల దరఖాస్తులు వివిధ దశల్లో ఉన్నాయని, వాటిని పరిశీలించి పదిరోజుల్లోగా ప్రక్రియ పూర్తి చేయాలని మంత్రి గంగుల కమలాకర్‌ అధికారులను ఆదేశించారు.  కొత్త రేషన్‌ కార్డుల పంపిణీ, డీలర్ల సమస్యలపై చర్చించేందుకు గంగుల కమలాకర్‌ అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయ్యింది. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ...కార్డుల్లో మార్పులు, చేర్పుల అంశం పరిగణనలోకి తీసుకోవాలని ముఖ్యమంత్రికి సిఫారసు చేసినట్లు తెలిపారు. మరణించిన వారిపేర్లను కూడా కార్డుల నుంచి తొలగించాల్సిన అవసరముందని, స్మార్ట్‌ కార్డులు ఇచ్చే అంశాన్ని కూడా ప్రతిపాదిస్తున్నామని గంగుల తెలిపారు. 1498 రేషన్‌ దుకాణాలు డీలర్లు లేక ఖాళీగా ఉన్నాయని అన్నారు. డీలర్ల నియామకంపైనా నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. ‘‘ డీలర్ల కమీషన్‌ పెంపు అంశంపైనా చర్చించాం. ఉపసంఘం చర్చించిన అన్ని అంశాలనూ ముఖ్యమంత్రికి నివేదిస్తాం. ఆయన నిర్ణయానికి అనుగుణంగా తగు చర్యలు తీసుకుంటాం’’ అని గంగుల వెల్లడించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని