కాస్త చూసి తినండి..

తాజా వార్తలు

Published : 23/03/2021 11:16 IST

కాస్త చూసి తినండి..

జాగ్రత్తగా ఉండకపోతే ప్రమాదం తప్పదని వైద్యుల హెచ్చరిక

ఇంటర్నెట్‌ డెస్క్‌: మనిషి జీవించాలంటే ఆహారం, నీళ్లు అతి ముఖ్యం. తినేది కూడా కల్తీ లేని శుభ్రమైన ఆహారమై ఉండాలి. ఇంట్లో వండుకోవడం కంటే బయట దొరికేది తినేందుకే జనం ఇష్టపడుతున్న ప్రస్తుత రోజుల్లో అనారోగ్యం బారిన పడేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఆహార పదార్థాల విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే ప్రమాదం తప్పదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కలుషిత ఆహారం ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోంది. కాలం చెల్లిన తినుబండారాలు, స్వీట్లు, బేకరీ పదార్థాలు తిని చాలా మంది అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారు. పాడైన ఆహార పదార్థాలు తినడం వల్ల విరోచనాలు, వాంతులు, గ్యాస్ట్రిక్‌ సమస్యలు, ఉదర సంబంధ వ్యాధుల బారిన పడుతున్నారు. కరోనా నేపథ్యంలో ప్రజలు కొంతకాలం ఇంటి ఆహారానికే ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ప్యాక్డ్‌ తినుబండారాలు, బేకరీ పదార్థాల విక్రయాలు తగ్గుముఖం పట్టాయి. ఆ తర్వాత యథా మామూలే. బేకరీలు, హోటళ్ల తిండి కోసం జనం క్యూ కడుతున్నారు. బయటి పదార్థాలు కొనే ముందు ఎక్కువ మంది కాలం చెల్లే తేదీ వివరాలు చూసుకోకపోవడం అధిక నష్టం కలిగిస్తోంది.

బేకరీల్లో తయారు చేసే పదార్థాలు ఎన్ని రోజులు నిల్వ ఉంటాయో చెప్పలేని పరిస్థితి. ప్యాక్డ్‌ వస్తువులు ఎప్పుడు తయారుచేశారు.. వాటి కాలం ఎప్పుడు తీరుతుందనే వివరాలు కూడా చాలా వరకు ఉండటం లేదు. ఇలాంటివి కూడా సమస్యలకు కారణమవుతున్నాయి.

ప్యాకేజీ యాక్ట్‌ ప్రకారం విక్రయించే అన్ని ఆహార పదార్థాలన్నింటిపై తగిన వివరాలు ఉండాల్సిందేనని అధికారులు స్పష్టం చేస్తున్నారు. నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. బయట కొనే పదార్థాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని, లేదంటే అనారోగ్య సమస్యల బారిన పడతారని ఆహార నిపుణులు సూచిస్తున్నారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని