యాదాద్రీశుడిని ద‌ర్శించుకున్న సీజేఐ దంప‌తులు
close

తాజా వార్తలు

Updated : 15/06/2021 12:15 IST

యాదాద్రీశుడిని ద‌ర్శించుకున్న సీజేఐ దంప‌తులు

యాదాద్రి: యాదాద్రి ల‌క్ష్మీన‌రసింహ‌స్వామిని భార‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తి(సీజేఐ) జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ దంప‌తులు ద‌ర్శించుకున్నారు. హైద‌రాబాద్ నుంచి ఈ ఉద‌యం బ‌య‌లుదేరి యాదాద్రి వెళ్లిన సీజేఐకు మంత్రులు ఇంద్ర‌క‌ర‌ణ్‌రెడ్డి, జ‌గ‌దీశ్‌రెడ్డి ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. ఆల‌య అర్చ‌కులు సీజేఐ దంప‌తుల‌ను పూర్ణ‌కుంభంతో ఆల‌యంలోకి స్వాగ‌తించారు. దర్శనం అనంతరం బాలాలయంలో జస్టిస్‌ ఎన్వీ రమణ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పండితులు వారికి వేదాశీర్వచనం అందించారు. దర్శనం తర్వాత ఆలయ నిర్మాణాలను సీజేఐ దంపతులు పరిశీలించారు. ఆలయ అభివృద్ధి, పనుల పురోగతిని మంత్రులు, అధికారులు.. నిర్మాణాల విశిష్టతను ఆర్కిటెక్ట్‌ ఆనందసాయి వారికి వివరించారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని