ఈ యాప్ పేరు ‘రిమూవ్ చైనా యాప్స్‌’

తాజా వార్తలు

Published : 02/06/2020 02:03 IST

ఈ యాప్ పేరు ‘రిమూవ్ చైనా యాప్స్‌’

దిల్లీ: ఈ డిజిటల్ యుగంలో సందేశాలు పంపుకోవడానికి, చెల్లింపుల కోసం, వీడియో మేకింగ్ కోసం..ఇలా ప్రతిదానికి ఒక యాప్ ఉంది. అయితే ఇప్పుడు మన ఫోన్‌లో ఉన్న యాప్‌లను డిలీట్ చేయడానికి కూడా ఓ యాప్‌ ఉందని తెలుసా! అసలు విషయం ఏంటంటే..

భారత్, చైనా సరిహద్దుల్లో కొద్ది వారాలుగా పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రముఖులు కొందరు చైనా ఉత్పత్తులను బాయ్‌కాట్ చేయాలని పిలుపునిస్తున్నారు. చైనా ఫోన్లను, యాప్‌లను వదిలించుకోవాలని, సైన్యంతోపాటు ప్రజలు కూడా ఆ దేశంపై ఒత్తిడి తేవాలని కోరుతున్నారు. ఇదిలా ఉండగా..దీన్ని వినియోగించుకుంటున్నారు కొందరు యాప్‌ డెవలపర్లు. వన్‌ టచ్ యాప్‌ ల్యాబ్స్ అనే సంస్థ మరీ వినూత్నంగా ఆలోచించి ‘రిమూవ్ చైనా యాప్స్’ అనే కొత్త యాప్‌ను లాంచ్ చేసింది. ఆ యాప్‌ చెప్పినట్లుగానే మన ఫోన్‌లో ఉన్న చైనాకు సంబంధించిన యాప్‌లన్నింటిని గుర్తించి, మనకు సమాచారం అందిస్తుంది. డిలీట్ చేయాలనుకుంటున్న యాప్ పక్కన రెడ్ కలర్‌లో బిన్ సింబల్ చూపిస్తుంది. దాన్ని ప్రెస్ చేయగానే ఫోన్‌లో నుంచి యాప్‌ అన్ఇన్‌స్టాల్ అవుతుంది. ఈ యాప్ లాంచ్‌ అయిన రెండు వారాల్లోనే  సుమారు 10లక్షల డౌన్‌లోడ్లు నమోదు చేసింది.

విద్యావిధానంలో సంస్కరణలు తీసుకువచ్చిన సోనమ్ వాంగ్‌చుక్‌ చైనా ఉత్పత్తుల వాడకం వదిలించుకొని, ఆ దేశానికి గట్టి బదులివ్వాలని కొద్ది రోజుల క్రితం పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అతని నుంచి స్ఫూర్తి పొందిన మోడల్ మిలింద్ సోమన్ టిక్‌టాక్‌ను డిలీట్ చేసినట్లు వెల్లడించారు. అలాగే చాలామంది ‘రిమూవ్ చైనా యాప్స్‌’ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని, వాడినట్లు స్క్రీన్ షాట్లను నెట్టింట్లో షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ యాప్‌ ఆండ్రాయిడ్ ప్లేస్టోర్‌లో 4.8 రేటింగ్‌తో దూసుకుపోతోంది. అయితే యాపిల్ డివైజ్‌లలో మాత్రం ఇంకా అందుబాటులోకి రాలేదు. కాగా, 2018 నుంచి చైనా యాప్స్‌ భారత మార్కెట్‌లో విపరీతంగా ప్రాచుర్యం పొందాయి. టిక్‌టాక్‌ మనదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన చైనీస్ యాప్. మనదేశానికి చెందిన కొందరు దీని వాడకం ద్వారా ఆర్జిస్తూ, సెలబ్రిటీలుగా మారిన సంగతి తెలిసిందే. 

ఇవీ చదవండి:

చైనాపై ‘3ఇడియట్స్’ రియల్ హీరో ఆగ్రహం

 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని