ఆ వాహనాలపై 3 రోజుల్లో నిర్ణయం తీసుకోండి

తాజా వార్తలు

Published : 24/06/2020 13:59 IST

ఆ వాహనాలపై 3 రోజుల్లో నిర్ణయం తీసుకోండి

ఏపీ హైకోర్టు ఆదేశం

అమరావతి: అక్రమ మద్యం రవాణా కేసులో సీజ్‌ చేసిన వాహనాల విడుదలపై హైకోర్టులో విచారణ ముగిసింది. హైకోర్టు ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ విచారణకు హాజరయ్యారు. అక్రమ మద్యం కేసు విషయంలో పోలీసులు నిబంధనలు పాటించలేదని పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ‘‘కొంతమంది ఎస్‌హెచ్‌వోల పనితీరు బాగాలేదు. కౌంటర్‌ దాఖలు చేయాలని ఏజీకి ఆదేశిస్తే... ఏజీపీతో మెమో ఫైల్‌ చేయించారు. వాహనాలను మూడు రోజుల్లోగా ఎస్‌హెచ్‌వోలు డిప్యూటీ ఎక్సైజ్‌ కమిషనర్ ‌(డీఈసీ) ముందు ప్రవేశపెట్టాలి. వాహనదారులు వెంటనే డీఈసీకి దరఖాస్తు చేసుకోవచ్చు. సీజ్‌ చేసిన వాహనాలపై మూడ్రోజుల్లోగా నిర్ణయం తీసుకోవాలి’’ అని అధికారులను హైకోర్టు ఆదేశించింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని