ఆప్తులే.. ప్రాణదాతలు: కుటుంబ సభ్యుల నుంచి పెరిగిన అవయవదానాలు 

తాజా వార్తలు

Updated : 28/09/2021 13:41 IST

ఆప్తులే.. ప్రాణదాతలు: కుటుంబ సభ్యుల నుంచి పెరిగిన అవయవదానాలు 

తెలంగాణలో 141 అవయవ మార్పిడి ఆపరేషన్ల నమోదు

అవయవ దానంలో దేశవ్యాప్తంగా మూత్రపిండాలే అత్యధిక సంఖ్యలో ఉంటున్నాయి. తమ సొంత కుటుంబ సభ్యుల ఔదార్యంతో బాధితులు తీవ్ర అనారోగ్యం నుంచి కోలుకుంటున్నారు. కేంద్ర వైద్యారోగ్య శాఖ 2020-21 నివేదిక ప్రకారం... కిందటేడాది ఏప్రిల్‌ 1 నుంచి సెప్టెంబరు 30 వరకు దేశవ్యాప్తంగా 1,884 అవయవాల మార్పిడి శస్త్రచికిత్సలు జరిగాయి. వీటిలో 1,370 (72.71%) కిడ్నీల మార్పిడివే కావడం గమనార్హం. ఇందులో కుటుంబ సభ్యులు ఇచ్చిన మూత్రపిండాలతో చేసినవి 1,269 ఉన్నాయి. తెలంగాణలో 141 అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు జరిగితే అందులో 65 కిడ్నీ, 50 కాలేయ, ఇతరాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన 27 అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు కిడ్నీలకు సంబంధించినవే కావడం గమనార్హం. కుటుంబ సభ్యులే బాధితులకు అవయవాల దానానికి ముందుకొస్తే... ఆంక్షలు తక్కువగా ఉంటాయి. ఇతరుల నుంచి పొందాలంటే... కఠిన ఆంక్షలు ఉంటాయి. బ్రెయిన్‌డెడ్‌ ప్రకటించిన వ్యక్తుల నుంచి అవయవాలు పొందాలన్నా.. తగిన సమయం ఉండాలి. అధిక వ్యయమూ అవుతుంది. జీవన్‌దాన్‌ జాబితాలోని సినియారిటీని అనుసరించి బ్రెయిన్‌డెడ్‌ కేసుల నుంచి అవయవాల మార్పిడి జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో బాధితులకు కిడ్నీలు ఇచ్చేందుకు కుటుంబ సభ్యులే ముందుకొస్తే... వైద్యులు పరీక్షించి అమరుస్తున్నారు.  


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని