Black Fungus:10 లక్షల డోసులు అందిస్తాం

తాజా వార్తలు

Updated : 28/05/2021 04:23 IST

Black Fungus:10 లక్షల డోసులు అందిస్తాం

భారత్‌కు గిలీడ్‌ సైన్సెస్‌ ఆపన్న హస్తం

వాషింగ్టన్‌: దేశంలో రోజురోజుకి పెరిగిపోతున్న బ్లాక్‌ ఫంగస్‌ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఆ వ్యాధికి సత్వర చికిత్స అందించేందుకు సరిపడా ఇంజెక్షన్లు లేకపోవడంతో సమస్య మరింత తీవ్రమవుతోంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అమెరికాకు చెందిన గిలీడ్‌ సైన్సెస్‌ సంస్థ భారత్‌కు సాయం అందించేందుకు ముందుకొచ్చింది. ఇప్పటికే 1.21 లక్షల యాంఫోటెరిసిన్‌-బి వయల్స్‌ను భారత్‌కు పంపించింది. మరో 85 వేల వయల్స్‌ త్వరలో రానున్నాయి. వీటితో పాటు మరో 10 లక్షల డోసులను అందించనున్నట్లు తెలిపింది. అత్యవసరంగా భారత్‌కు టీకాలు సరఫరా చేసేందుకు ఇతర దేశాల్లోని టీకా నిల్వలను కూడా వెనక్కి తీసుకుంటోంది. మరోవైపు భారత్‌లోని మైలాన్‌ ఫార్మా ద్వారా ఉత్పత్తిని వేగవంతం చేసేందుకు గిలీడ్‌ ప్రయత్నాలు చేస్తోంది. యాంఫోటెరిసిన్‌-బి ఇంజెక్షన్ల లభ్యతను పెంచడానికి ప్రభుత్వం ఇప్పటికే 5 ఫార్మా కంపెనీలకు లైసెన్సులు ఇచ్చింది. బుధవారం మరో 29,250 వయల్స్‌ను బ్లాక్‌ ఫంగస్‌ కేసుల తీవ్రత బట్టి వివిధ రాష్ట్రాలకు పంపిణీ చేసినట్లు కేంద్ర రసాయన, ఎరువుల శాఖ మంత్రి డీవీ సదానంద గౌడ తెలిపారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని