అశ్లీల వీడియోలు చూసిన ఎమ్మెల్సీ!

తాజా వార్తలు

Updated : 31/01/2021 06:16 IST

అశ్లీల వీడియోలు చూసిన ఎమ్మెల్సీ!

కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ ప్రకాశ్‌ రాథోడ్‌ నిర్వాకం

బెంగళూరు: కర్ణాటక శాసనమండలిలో బడ్జెట్‌ సమావేశాలు జరుగుతున్న వేళ సభలో కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ ప్రకాశ్‌ రాథోడ్‌ సెల్‌ఫోన్‌లో అశ్లీల వీడియోలు చూశారన్న వార్తలు కలకలం సృష్టిస్తున్నాయి. ప్రకాశ్‌ రాథోడ్‌ అశ్లీల వీడియోలు చూస్తున్న దృశ్యాలను కొన్ని కన్నడ వార్తా ఛానెళ్లు ప్రచారం చేశాయి. ప్రజా సమస్యలపై చర్చ జరుగుతున్న సమయంలో ఈ పాడు పని ఏమిటంటూ ప్రజలు, నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్సీపై చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాలు డిమాండ్‌ చేశాయి. రాథోడ్‌ చేసిన పనిని తప్పుబట్టిన భాజపా ఆయనను వెంటనే సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేసింది. అయితే తనపై వచ్చిన ఆరోపణలను ప్రకాశ్‌ రాథోడ్‌ ఖండించారు. తాను ఎలాంటి వీడియోలు చూడలేదని, సెల్‌ఫోన్‌లో మెమొరీ నిండిపోవడంతో కొన్నింటిని డిలీట్‌ చేసినట్లు తెలిపారు.

కర్ణాటకలో 2012లోనూ ముగ్గురు మంత్రులు శాసనసభలో అశ్లీల వీడియోలు చూస్తూ దొరికిపోయారు. ఈ ఘటన తర్వాత వారు ముగ్గురూ తమ పదవులకు రాజీనామా చేశారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని