నిర్లక్ష్యంపై యువకుడి ఆవేదన.. 24 గంటల్లోపే..

తాజా వార్తలు

Published : 25/04/2021 11:26 IST

నిర్లక్ష్యంపై యువకుడి ఆవేదన.. 24 గంటల్లోపే..

బెంగళూరు: కర్ణాటకలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. ఆసుపత్రి వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని.. తనను వెంటనే డిశ్ఛార్జి చేయాలని వేడుకున్న ఓ యువకుడు 24 గంటలు తిరిగేలోపే మృత్యువాత పడ్డాడు. కర్ణాటక రాజధాని బెంగళూరుకు చెందిన ఓ యువకుడు జ్వరంతో గతవారం స్థానిక ఆక్స్‌ఫర్డ్‌ ఆసుపత్రిలో చేరాడు. అయితే, సిబ్బంది పట్టించుకోవడం లేదని, తనను వెంటనే ఇక్కడి నుంచి డిశ్ఛార్జి చేయాలంటూ సదరు యువకుడు ఓ వీడియో ద్వారా వేడుకున్నాడు. కాగా ఈక్రమంలోనే శనివారం నాటికి పూర్తిగా ఆరోగ్యం క్షీణించడంతో అతడు మృత్యువాతపడ్డాడు. 

కొడుకు క్షేమంగా తిరిగివస్తాడని ఆసుపత్రి బయటే ఎదురుచూస్తున్న తల్లి ఈ విషయం తెలుసుకొని తల్లడిల్లిపోయింది. కన్నీరుమున్నీరుగా విలపించింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తన కుమారుడు మృతిచెందాడంటూ ఆవేదన వ్యక్తం చేసింది.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని