AP news: ఎన్నారై ఆస్పత్రి వ్యవహారంపై హౌస్‌మోషన్‌
close

తాజా వార్తలు

Updated : 24/06/2021 16:09 IST

AP news: ఎన్నారై ఆస్పత్రి వ్యవహారంపై హౌస్‌మోషన్‌

అమరావతి: ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రి వ్యవహారంపై హైకోర్టులో హౌస్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలైంది. కొందరు తమపై తప్పుడు ఆరోపణలతోనే ఫిర్యాదు చేసినట్లు  నిమ్మగడ్డ ఉపేంద్రనాథ్‌, మణి అక్కినేని, పోలవరపు రాఘవరావు పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ ముగ్గురిపై నిన్న మంగళగిరి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఇవాళ్టి బోర్డు మీటింగ్‌కు వెళ్లనీయకుండా చేసేందుకే తప్పుడు ఫిర్యాదు చేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం.. పిటిషనర్లపై ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు చేపట్టవద్దని ఆదేశించింది.

ఎన్నారై ఆస్పత్రి వివాదంపై ప్రెసిడెంట్‌ రాఘవరావు వివరణ ఇచ్చారు. ‘‘ రెండు రోజుల క్రితం ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సమావేశం జరిగింది. ప్రవర్తన సరిగా లేదన్న కారణంగా కార్యదర్శి ముక్కామల అప్పారావును తొలగించాం. ఇవాళ పాలక మండలి సమావేశం జరిగింది. ఈ భేటీలో 17 మంది సభ్యులు పాల్గొన్నారు. నేను అధ్యక్షుడిగా ఎన్నికయ్యాను. కమిటీలో కొందరు కళాశాలను అమ్మాలని చూస్తున్నారు. అందుకు మేం వ్యతిరేకం’’ అని అన్నారు.

విచారణ అనంతరం వైస్‌ ప్రెసిడెంట్‌ నిమ్మగడ్డ ఉపేంద్రనాథ్‌ మాట్లాడుతూ..‘‘ మా వర్గంలో 17 మంది సభ్యులు ఉన్నారు. అప్పారావు వర్గంలో 13 మంది మాత్రమే ఉన్నారు. కళాశాలను బలవంతంగా తీసుకోవాలని చూస్తున్నారు.రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్లను పక్కదారిపట్టించినట్లు ఆరోపించారు. ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని విచారణలో తేలింది. కొత్త యాజమాన్యకమిటీని వారికివారే ప్రకటించుకున్నారు. మెజారిటీ వర్గం మావైపే ఉన్నందున కొత్త కమిటీ చెల్లదు’’ అని చెప్పారు.

కోశాధికారి అక్కినేని మణి మాట్లాడుతూ.. గతంలో లింగమనేని గ్రూపు తమ సంస్థలో చొరబడినట్లు వివరించారు. కొందరు సభ్యులు దొడ్డిదారిన సంస్థలోకి వచ్చారని అన్నారు. తమ డైరెక్టర్ల్లో కొంతమందిని తమవైపు తిప్పుకున్నారని ఆరోపించారు. సంస్థను అమ్మేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని, కొత్తగా వచ్చేవాళ్లు సంస్థను నడపడంపై తమకు అనుమానాలున్నాయని అన్నారు. మమ్మల్ని తప్పించేందుకే నిధుల మళ్లింపు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని