Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

తాజా వార్తలు

Published : 04/08/2021 08:57 IST

Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. ఆందోళనకరంగా ఆర్‌ ఫ్యాక్టర్‌

 దేశంలో కొవిడ్‌ రెండో ఉద్ధృతి (సెకెండ్‌ వేవ్‌) ముగిసిపోలేదని.. జాగ్రత్తలు పాటించడంలో, కరోనా కట్టడి చర్యల్లో నిర్లక్ష్యానికి చోటివ్వొద్దని పదేపదే చెబుతున్న కేంద్ర ప్రభుత్వం తాజాగా మరోసారి హెచ్చరించింది. 8 రాష్ట్రాల్లో కొవిడ్‌ వ్యాప్తి తీవ్రతను తెలిపే ‘ఆర్‌ ఫ్యాక్టర్‌’ (రీప్రొడక్షన్‌ నంబర్‌) 1 దాటినట్లు మంగళవారం తెలిపింది. ఈమేరకు తమిళనాడు, కేరళ, కర్ణాటక, మిజోరం, హిమాచల్‌ప్రదేశ్‌ తదితర చోట్ల పరిస్థితి ఆందోళనకరంగా మారుతున్నట్లు పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ఫైనల్‌ దారిలో.. ఆశల పల్లకిలో!

టోక్యో ఒలింపిక్స్‌లో భారత క్రీడాకారులకు అత్యంత కీలకమైన రెండు పోరాటాలకు సమయం ఆసన్నమైంది. బాక్సింగ్‌ 69 కేజీల విభాగంలో ఇప్పటికే క్వార్టర్స్‌ దాటి పతకం ఖాయం చేసిన లవ్లీనా.. బుధవారం సెమీఫైనల్లో ప్రపంచ ఛాంపియన్‌ బుసానెజ్‌ (టర్కీ)ను ఢీకొనబోతోంది. ఈ బౌట్‌లో గెలిస్తే లవ్లీనాకు స్వర్ణం సాధించే అవకాశం లభిస్తుంది. సెమీస్‌లో ఓడితే కాంస్యంతో సంతృప్తి చెందాల్సి ఉంటుంది. ఇక మూడుసార్లు ఒలింపిక్‌ ఛాంపియన్‌ అయిన ఆస్ట్రేలియాకు క్వార్టర్స్‌లో షాకిచ్చి సంచలనం సృష్టించిన మహిళల హాకీ జట్టు సైతం సెమీస్‌లో అర్జెంటీనాతో తలపడనుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

అమ్మాయిలూ.. అదరగొట్టేయండి

3. రాష్ట్రాల రుణ పరిమితికి కొత్త సూత్రాలు

రాష్ట్ర ప్రభుత్వాలు తమ స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ) అంచనాలను పెంచి చూపడం ద్వారా అధికంగా అప్పులు చేస్తున్నాయని... వాటి రుణ పరిమితిని నిర్వచించేందుకు కొత్త సూత్రీకరణ అవసరమని ఎస్‌బీఐ ఆర్థిక నిపుణులు అభిప్రాయపడ్డారు. దేశంలో అతిపెద్ద రుణదాత సంస్థ అయిన ఎస్‌బీఐ... ‘ఎకోరాప్‌’ పేరున రూపొందించిన ఆర్థిక పరిశోధన నివేదికను మంగళవారం విడుదల చేసింది. ఈ సందర్భంగా ఆ సంస్థ ప్రధాన ఆర్థికవేత్త సౌమ్యా కాంతి ఘోష్‌ మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. గేట్‌లో పెరుగుతున్న సబ్జెక్టులు

గేట్‌కు ఏటా సబ్జెక్టుల సంఖ్య పెరుగుతోంది. విద్యార్థులకు మరింత వెసులుబాటు ఉండనుంది. గేట్‌-2021 వరకు 27 రకాల సబ్జెక్టుల్లో పరీక్షలు నిర్వహించారు. ఐఐటీలు, ఎన్‌ఐటీలతోపాటు దేశవ్యాప్తంగా పలు జాతీయ, రాష్ట్ర విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో ఎంటెక్‌ సీట్ల భర్తీకి గేట్‌ (గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్టు ఇన్‌ ఇంజినీరింగ్‌) చేపడతారు. 2022లో నిర్వహించే పరీక్షకు రెండు సబ్జెక్టులు- జియోమాటిక్స్‌ ఇంజినీరింగ్‌(జీఈ), నావల్‌ ఆర్కిటెక్చర్‌ అండ్‌ మెరైన్‌ ఇంజినీరింగ్‌(ఎన్‌ఎం) అదనంగా ఉంటాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* Natasha Peri: అసాధారణ ప్రతిభతో అమెరికా అగ్ర యూనివర్సిటీని మెప్పించిన బాలిక

5. డిసెంబరుకు 50% మంది కార్యాలయాలకు!

కొవిడ్‌-19 నేపథ్యంలో ఇంటి నుంచి పనిచేస్తున్న ఉద్యోగులను తిరిగి కార్యాలయాలకు రప్పించేందుకు ఐటీ సంస్థలు ప్రయత్నాలు ప్రారంభించాయి. మొత్తం ఐటీ ఉద్యోగుల్లో ప్రస్తుతం 5 శాతం మంది ఆఫీసులకు వస్తుండగా, డిసెంబరు నాటికి ఇది 50 శాతానికి చేరుకోవాలని కంపెనీలు ఆశిస్తున్నాయని  హైదరాబాద్‌ సాఫ్ట్‌వేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ అసోసియేషన్‌ (హైసియా) నిర్వహించిన ‘ఫ్యూచర్‌ వర్క్‌ మోడల్స్‌’ సర్వేలో తేలింది. 500 మంది ఉద్యోగులకన్నా తక్కువగా ఉన్న ఐటీ సంస్థల్లో ఇప్పటికే 20 శాతం మంది కార్యాలయాలకు వస్తున్నారని పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. Weight: వయసు రెండేళ్లే.. బరువు మాత్రం 45 కిలోలు

రెండేళ్ల వయసుకే 45 కిలోల బరువు పెరిగిన ఖాయతి అనే చిన్నారికి దిల్లీలోని మాక్స్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి వైద్యులు బేరియాట్రిక్‌ శస్త్రచికిత్స చేసి కడుపు పరిమాణాన్ని తగ్గించారు. ఖాయతి పుట్టినప్పుడు 2.5 కిలోల సాధారణ బరువుతోనే ఉందని, ఆ తర్వాత 6 నెలలకే అనూహ్యంగా బరువు పెరిగి 14 కిలోలకు చేరుకుందని వైద్యులు చెప్పారు. 2 ఏళ్ల 3 నెలల వయసుకు 45 కిలోలు పెరిగిందన్నారు. సాధారణంగా ఆ వయసు అమ్మాయిలు 12-15 కిలోల బరువుంటారని పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* చిన్నారి కడుపులో పిండం.. తొలగించిన వైద్యులు

7. టీవీల్లో కనిపిస్తే అంతం చేస్తామని బెదిరించారు

మరోసారి టీవీల్లో కనిపిస్తే అంతం చేస్తామని హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ (వైకాపా) తనను బెదిరించారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్‌సభ సభాపతి ఓం బిర్లాకు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు (వైకాపా) ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వారికి లేఖలు రాశారు. ‘మంగళవారం ఉదయం 11.50 గంటల సమయంలో లోక్‌సభ వాయిదా పడిన తర్వాత పార్లమెంటు సెంట్రల్‌ హాలులో ఉన్న నా దగ్గరకు వచ్చిన ఎంపీ మాధవ్‌ అసభ్య పదజాలంతో దూషించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. పువ్వుల్లో దాగున్న నిజం!

హాయ్‌.. ఫ్రెండ్స్‌.. బాగున్నారా! నేను మీ చిన్నూను. మనలాంటి చిన్నారుల్ని, వాళ్ల నవ్వుల్ని పువ్వుల్తో పోల్చుతుంటారు కదూ! అయినా ఇప్పుడు వాటి ప్రస్తావన ఎందుకు? అంటారేమో.. పువ్వుల గురించి ఓ ఆసక్తికరమైన విషయం నాకు మా తాతయ్య నిన్ననే చెప్పారు. అది మీతో పంచుకుందామని ఇదిగో ఇప్పుడు ఇలా వచ్చాను. మనం కాసేపు ఎండలో తిరిగితే మన ఇంట్లో వాళ్లు మనల్ని కోప్పడతారు. ‘చూడు ఎలా నల్లగా అయిపోయావో’ అంటారు కదా.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

మందేసి.. చిందేసి

9. క్రీడాశాస్త్రం

ఒలింపిక్‌ క్రీడలనగానే ఎక్కడలేని ఆసక్తీ పుట్టుకొస్తుంది. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే క్రీడాకారుల విన్యాసాలు ప్రతిసారీ కొత్త రికార్డులను సృష్టిస్తూనే ఉన్నాయి. పరుగు, ఈత, జిమ్నాస్టిక్స్‌, పోల్‌వాల్ట్‌ వంటి అథ్లెటిక్స్‌ మానవ శక్తి, సామర్థ్యాలకు నిజమైన పరీక్షలుగా నిలుస్తూనే వస్తున్నాయి. ఆటగాళ్ల నైపుణ్యం, ప్రతికూలతలను అధిగమించే ధైర్యం, బలం ఎప్పుడూ ఆశ్చర్యకరమే. చూడటానికివి ఆటలే కావొచ్చు గానీ వీటి వెనక ఉన్నందంతా సైన్స్‌ మాయాజాలమే! పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. Tokyo Olympics: జావెలిన్‌ త్రో ఫైనల్‌కు అర్హత సాధించిన నీరజ్‌ చోప్రా.. నిరాశపరిచిన శివపాల్‌

ఒలింపిక్స్‌ పురుషుల జావెలిన్‌ త్రోలో భారత్‌కు చెందిన నీరజ్‌ చోప్రా ఫైనల్‌కు అర్హత సాధించాడు. గ్రూప్‌-ఎ క్వాలిఫై రౌండ్‌లో తన తొలి ప్రయత్నంలోనే 86.65 మీటర్లు విసిరాడు. ఈ సీజన్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఫిన్లాండ్‌ అథ్లెట్‌ లస్సి ఇటెలాటాలో తర్వాతి స్థానంలో నీరజ్‌ చోప్రా నిలిచాడు. జావెలిన్‌ త్రో ఫైనల్‌ ఈనెల 7న జరగనుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

‘ఆమె ఆశలకు..’ అంతర్జాతీయ పురస్కారం!


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని