దిల్లీలో లాక్‌డౌన్‌ పొడిగిస్తారా? 
close

తాజా వార్తలు

Published : 24/04/2021 23:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దిల్లీలో లాక్‌డౌన్‌ పొడిగిస్తారా? 

దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో కరోనా విలయతాండవం చేస్తున్న వేళ లాక్‌డౌన్‌ పొడిగించాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేవలం ఆరు రోజులు మాత్రమే లాక్‌డౌన్‌ ఉంటుందని ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ ప్రకటించినప్పటికీ దాదాపు 70శాతం మంది వ్యాపారులు లాక్‌డౌన్‌ పొడిగింపుకే మొగ్గు చూపుతున్నట్లు ఓ సర్వేలో వెల్లడైంది. ఈ మేరకు ఛాంబర్‌ ఆఫ్‌ ట్రేడ్‌ అండ్‌ ఇండస్ట్రీ (సీటీఐ) వెల్లడించింది. 700లకు పైగా వ్యాపార సంస్థలు ఈ సర్వేలో పాల్గొనగా.. దాదాపు 500 వ్యాపార సంస్థలు లాక్‌డౌన్‌ కొనసాగించాలనే కోరాయి.

‘‘చాలా వ్యాపార సంస్థలు లాక్‌డౌన్‌ను పొడిగించాలనే అభిప్రాయపడుతున్నాయి. కనీసం మరో 5 నుంచి 7 రోజుల పాటు లాక్‌డౌన్‌ పెంచాలని కోరుతున్నాయి. అయితే లాక్‌డౌన్‌ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి కట్టుబడి ఉన్నాం. స్వతంత్రంగా ఏ నిర్ణయం తీసుకోబోం’’ అని సీటీఐ ఛైర్మన్‌ బ్రిజేష్‌ గోయల్‌ వెల్లడించారు.

6 రోజుల పాటు దిల్లీలో లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు ఏప్రిల్‌ 19న ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఏప్రిల్‌ 19 రాత్రి 10 గంటల నుంచి ఏప్రిల్‌ 26 ఉదయం 5 గంటల వరకు లాక్‌డౌన్‌ అమల్లో ఉంటుందని తెలిపారు. అయినప్పటికీ కొవిడ్‌ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుండటంతో లాక్‌డౌన్‌ను కొనసాగిస్తారా? లేదా? అనే అంశంపై సందిగ్ధత నెలకొంది. దిల్లీలో నిన్న ఒక్కరోజే 24,331 కరోనా కేసులు నమోదవ్వగా 348 మంది ప్రాణాలు కోల్పోయారు. దిల్లీ నగరంలో గడిచిన 11 రోజుల్లోనే దాదాపు 2,100 మంది ప్రాణాలు కోల్పోవడం గమనార్హం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని