close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్ @ 5 PM

1. ఛైర్మన్‌ షరీఫ్‌ను కొట్టబోయారు: చంద్రబాబు

శాసన మండలి ఛైర్మన్‌ షరీఫ్‌, తెదేపా ఎమ్మెల్సీలు రాష్ట్ర భవిష్యత్తు కోసం నిలబడ్డారని ఆ పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ ఉపసంహరణ బిల్లులను మండలి ఛైర్మన్‌ సెలెక్ట్‌ కమిటీకి పంపడం.. మండలి రద్దు దిశగా ప్రభుత్వ నిర్ణయం తీసుకోనుందనే వార్తల నేపథ్యంలో మీడియాతో ఆయన మాట్లాడారు. మండలిలో బిల్లులు ఆమోదం పొందేందుకు అధికార పార్టీ తమ సభ్యులను ప్రలోభాలతో పాటు బెదిరింపులకు గురిచేసిందని..అయినా తమ సభ్యులు లొంగలేదన్నారు. మండలిలో జరిగిన పరిణామాలపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బిల్లులను సెలెక్ట్‌ కమిటీకి పంపారనే అక్కసుతో ఛైర్మన్‌ షరీఫ్‌ను వైకాపా సభ్యులు కొట్టబోయారని ఆరోపించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. మండలిపై ప్రభుత్వానిది అనవసర రాద్ధాంతం

శాసనమండలిపై ప్రభుత్వం అనవసర రాద్ధాంతం చేస్తోందని ఏపీ శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్‌ రెడ్డి సుబ్రమణ్యం ఆరోపించారు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఏదైనా బిల్లును సెలెక్ట్‌ కమిటీకి పంపితే ఆ బిల్లును వ్యతిరేకించినట్లుగానీ.. ఆమోదించినట్లుగానీ కాదన్నారు. కేవలం ప్రజాభిప్రాయం కోసమే బిల్లులను సెలెక్ట్‌ కమిటీకి పంపారని పేర్కొన్నారు. సెలెక్ట్‌ కమిటీ ఏం చెబుతుందో ప్రభుత్వం వేచి చూడాలని సుబ్రమణ్యం చెప్పారు. వ్యక్తిగత కక్షతో మండలిని రద్దు చేస్తామని ప్రభుత్వం అనడం భావ్యం కాదన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ‘ఓట్లు సమానంగా వస్తే లాటరీతో విజేత ఎంపిక’

రాష్ట్రంలో మున్సిపల్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ (ఎస్‌ఈసీ) నాగిరెడ్డి తెలిపారు. దీనికి సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేశామని ఆయన చెప్పారు. రేపు సాయంత్రానికి అన్ని ఫలితాలు వస్తాయని.. ఈనెల 27న మేయర్లు, ఛైర్‌పర్సన్ల ఎన్నికకు పరోక్ష ఎన్నిక నిర్వహిస్తామన్నారు. ఈనెల 29న కరీంనగర్‌ మేయర్‌ ఎన్నిక ఉంటుందని చెప్పారు. పరోక్ష ఎన్నికలో ఓట్లు సమానంగా వస్తే లాటరీ ద్వారా విజేతను ఎంపిక చేస్తామని నాగిరెడ్డి స్పష్టం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. అధికారులంతా గుడారాలేసుకోవాలా?:సోమిరెడ్డి

రాజ్యాంగంలో రాజధాని అనే పదమే లేదని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి చెబుతున్నారని, ఈ అంశాన్ని ప్రస్తావించకుండా అంబేడ్కర్‌ పొరపాటు చేశారేమోనని మాజీ మంత్రి సోమిరెడ్డి వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని తొలిసారిగా జగనే గుర్తించినట్లున్నారని ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఆయన ట్విటర్‌లో పోస్టు చేశారు. సీఎం ఎక్కడ కూర్చుంటే అక్కడే రాజధాని అంటున్నారని, ఈ లెక్కన ఆయన వెనకే అధికారులంతా గుడారాలేసుకుంటే సరిపోతుందని సోమిరెడ్డి ఎద్దేవా చేశారు. మొత్తానికి రాజధానికి సీఎం జగన్‌ కొత్త నిర్వచనం చెబుతున్నారని అన్నారు. ఈ మాత్రం ఆలోచన 72 ఏళ్లు పాలించిన వారికి లేకుండా పోయిందని సోమిరెడ్డి అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. సర్‌.. మీ ఫోన్‌కు ఛార్జింగ్‌ కూడా పెట్టుకోవచ్చు

దిల్లీలో ఉచిత వైఫై గురించి అమిత్‌షా చేసిన వ్యాఖ్యలకు సీఎం కేజ్రీవాల్‌ కౌంటర్‌ ఇచ్చారు. నిన్న జరిగిన ఎన్నికల ప్రచార సభలో అమిత్‌షా మాట్లాడుతూ కేజ్రీవాల్‌పై విమర్శలు చేశారు. ‘ఉచిత వైఫై ఇచ్చామని కేజ్రీవాల్‌ చెబుతున్నారు.. కానీ నాకు ఎక్కడా వైఫై దొరకలేదు. వెతికి వెతికి నా ఫోన్‌లో ఛార్జింగ్‌ అయిపోయి ఆఫ్‌ అయ్యింది’ అని కేంద్రమంత్రి విమర్శలు గుప్పించారు. దీనికి కేజ్రీవాల్‌ ట్విటర్‌ ద్వారా కౌంటర్‌ ఇచ్చారు. ‘సర్‌ ఉచిత వైఫైతో పాటు మేము ఉచితంగా బ్యాటరీ ఛార్జింగ్‌ పెట్టుకునేందుకు కూడా ఏర్పాటు చేశాం. దిల్లీలో 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటును అందిస్తున్నాం’ అంటూ కేజ్రీవాల్‌ ట్వీట్‌ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. రజనీపై కేసును కొట్టివేసిన మద్రాస్‌ హైకోర్టు

పెరియార్‌ రామస్వామిపై తప్పుడు వ్యాఖ్యలు చేశారంటూ తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌పై దాఖలైన కేసును మద్రాసు హైకోర్టు కొట్టివేసింది. ‘‘మొదట మేజిస్ట్రేట్‌ కోర్టుకు వెళ్లటానికి బదులు తొందరపడి హైకోర్టుకు ఎందుకు వచ్చినట్టు?’’ అని ఈ సందర్భంగా న్యాయస్థానం ప్రశ్నించింది. తమిళనాడుకు చెందిన సంఘ సంస్కర్త పెరియార్ రామస్వామిపై సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ అభ్యంతరకరమైన అరోపణలు చేశారని ద్రవిడర్‌ విడుదలై కళగమ్‌ అధ్యక్షుడు మణి ఫిర్యాదు చేశారు. ఈయన ఫిర్యాదు మేరకు చెన్నై పోలీసులు రజనీపై కేసు నమోదు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ముంబయిలో ‘కరోనా’ వైరస్‌..?

ప్రాణాంతక కరోనా వైరస్‌ ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది. చైనా నుంచి ముంబయి వచ్చిన ఇద్దరిని కరోనా సోకిందేమోననే అనుమానంతో వారిని ఆస్పత్రికి తరలించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వార్డుకి వారిద్దరినీ తరలించి అన్ని పరీక్షలు చేస్తున్నారు. ఆ ఇద్దరు వ్యక్తులు జలుబు, దగ్గుతో బాధపడుతుంటే కరోనా లక్షణాలేమైనా ఉన్నాయేమోనని వారిని ప్రత్యేకంగా పరీక్షిస్తున్నట్లు బృహన్‌ ముంబయి మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ హెల్త్‌ ఆఫీసర్‌ డా.పద్మజ కేస్కర్‌ తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ఉతికారేసిన రాహుల్‌, కోహ్లీ, అయ్యర్‌

న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20లో టీమిండియా ఘన విజయం సాధించింది. కివీస్‌ నిర్దేశించిన 204 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్‌ నాలుగు వికెట్లు కోల్పోయి ఒక ఓవర్‌ మిగిలుండగానే ఛేదించింది. ఆదిలోనే రోహిత్‌శర్మ(7) నిరాశ పరిచినా.. కేఎల్‌ రాహుల్‌(56; 27 బంతుల్లో 4x4, 3x6), కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ(45; 32 బంతుల్లో 3x4, 1x6) జట్టును ఆదుకున్నారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 99 పరుగుల భాగస్వామ్యం జోడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. కొనుగోళ్ల అండతో లాభాల్లో మార్కెట్లు

దేశీయ సూచీలు ఈ వారాన్ని భారీ లాభాలతో ముగించాయి. యస్‌ బ్యాంక్‌, టెక్‌ మహీంద్రా వంటి కంపెనీల షేర్ల కొనుగోలు అండతో వరుసగా రెండో రోజు సూచీలు లాభాలను దక్కించుకున్నాయి. ఐటీ మినహా ఆటో, లోహ, ఎఫ్‌ఎంసీజీ, ఇన్‌ఫ్రా, బ్యాంకింగ్‌  రంగాల షేర్లలో కొనుగోళ్లు మార్కెట్లకు కలిసొచ్చాయి. శుక్రవారం ట్రేడింగ్‌ను ఫ్లాట్‌గా ప్రారంభించినప్పటికీ ఆ తర్వాత కొద్దిసేపటికే కోలుకున్నాయి. సెన్సెక్స్‌ 226.79 పాయింట్లు లాభపడి 41,613.10 వద్ద ముగిసింది. అటు నిఫ్టీ 67.90 పాయింట్లు ఎగబాకి 12,248.30 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.71.34 వద్ద కొనసాగుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. హైదరాబాద్‌: నగల దుకాణంలో మోడల్స్‌ సందడి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.