close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 18/04/2020 14:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

బీసీసీఐ అలా చేయదని అనుకుంటున్నా

ఐపీఎల్ కోసం తప్పకుండా వేరే సమయాన్ని కనుగొంటారు: సీపీఎల్‌ సీఈఓ

జమైకా: భారత్‌లో కరోనా వైరస్‌ విస్తరిస్తున్న నేపథ్యంలో ఐపీఎల్‌ 13వ సీజన్ నిర్వహణపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే.. సెప్టెంబర్‌, అక్టోబర్‌ నెలల్లో బీసీసీఐ ఈ ఐపీఎల్‌ సీజన్‌ను నిర్వహించే అవకాశాలున్నాయి. అయితే అందుకు ఆసియాకప్‌తో పాటు టీ20 ప్రపంచకప్‌ షెడ్యూళ్లును మార్చాల్సి ఉంటుంది. ఒకవేళ అదే నిజమైతే బీసీసీఐ సెప్టెంబర్‌లో ఐపీఎల్‌ను నిర్వహించరాదని కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(సీపీఎల్‌) సీఈఓ పీట్‌ రసెల్‌ అన్నాడు.  ఆగస్టు 19 నుంచి సెప్టెంబర్‌ 26వరకు సీపీఎల్‌ షెడ్యూల్‌ ఖరారైనందున బీసీసీఐ వేరే సమయాన్ని ఎంచుకోవాలని సూచించాడు.

‘బీసీసీఐ సెప్టెంబర్‌లో ఐపీఎల్‌ను నిర్వహిస్తే మేం ఒప్పుకోం. ఇలాంటి విషయాల్లో భారత క్రికెట్‌ బోర్డు చాలా బలమైందని నాకు తెలుసు. ఇతర జట్ల ఆటగాళ్లు, వేరే లీగులు ఏం చేస్తున్నాయో కూడా వాళ్లు పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరముంది’ అని రసెల్‌ ఈఎస్‌పీఎన్‌ క్రిక్‌ఇన్ఫోతో అన్నాడు. ‘వెస్టిండీస్‌ ఆటగాళ్లంతా ఐపీఎల్‌లో ఆడాలని ఆ లీగ్‌ నిర్వహకులు అనుకుంటారు. అయితే, సీపీఎల్‌ జరిగే సమయంలోనే ఐపీఎల్‌ ఉండటం సరికాదు. ఎందుకంటే చాలా మంది ఐపీఎల్‌ ఆటగాళ్లు సీపీఎల్‌లోనూ ఆడుతుంటారు. అది మా లీగ్‌ నైతికతను దెబ్బతీస్తుంది. అలా చేయాల్సిన అవసరం బీసీసీఐకు లేదనుకుంటా. తప్పకుండా వేరే సమయాన్ని కనుగొంటారని ఆశిస్తున్నా’ అని పీట్‌ రసెల్‌ వివరించాడు.

క కరీబియన్‌ దీవుల్లో కరోనా వైరస్‌పై స్పందించిన అతడు అక్కడ ముందే లాక్‌డౌన్‌ ప్రకటించడంతో మంచి జరిగిందని చెప్పాడు. ఇతర దేశాలతో పోలిస్తే తమ వద్ద కరోనా వైరస్‌ వ్యాప్తి చాలా తక్కువగా ఉందన్నాడు. తమకింకా సమయం ఉన్నందున ఇప్పుడే తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోమని చెప్పాడు. అప్పటికీ పరిస్థితులు అనుకూలంగా ఉంటేనే సీపీఎల్‌ను నిర్వహిస్తామని స్పష్టంచేశాడు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.