మళ్లీ చెబుతున్నా.. ఇస్రో ప్రైవేటీకరణ జరగదు! 
close

తాజా వార్తలు

Updated : 20/08/2020 18:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మళ్లీ చెబుతున్నా.. ఇస్రో ప్రైవేటీకరణ జరగదు! 

వెబినార్‌లో ఇస్రో ఛైర్మన్‌ శివన్‌

బెంగళూరు: అంతరిక్ష పరిశోధనా రంగంలో కేంద్రం ప్రకటించిన సంస్కరణల అంశంపై ఇస్రో ఛైర్మన్‌ కె.శివన్‌ స్పందించారు. ఇస్రోను ప్రైవేటీకరిస్తారంటూ వస్తోన్న అపోహలను ఆయన తోసిపుచ్చారు. అంతరిక్ష పరిశోధనా రంగంలో సంస్కరణలు తేనున్నట్టు కేంద్రం ప్రకటించగానే ఇస్రోను ప్రైవేటీకరిస్తారనే కోణంలో అనేక అపోహలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో గురువారం శివన్‌ ఓ వెబినార్‌లో మాట్లాడుతూ.. కేంద్రం సంస్కరణలు ప్రకటించగానే ఇస్రోను ప్రైవేటీకరిస్తారనే అపోహలు వచ్చాయని.. అది సరికాదన్నారు. ఇస్రో ప్రైవేటీకరణ జరగదని మళ్లీ మళ్లీ చెబుతున్నానని పేర్కొన్నారు. ఈ సంస్కరణలు భారతీయ అంతరిక్ష రంగంలో నిజమైన గేమ్‌ ఛేంజర్‌ అవుతుందని శివన్‌ అభిప్రాయపడ్డారు.

అంతరిక్ష కార్యకలాపాల్లో మెరుగైన ప్రైవేటు సంస్థలకు భాగస్వామ్యం కల్పించడమే సంస్కరణల ఉద్దేశమని తెలిపారు. అంతరిక్ష కార్యకలాపాలకు సంబంధించిన బిల్లు దాదాపు తుది దశలో ఉందన్న శివన్‌.. కేంద్ర కేబినెట్‌ ఆమోదం కోసం త్వరలోనే వారి ముందు పెడతామని చెప్పారు. వాస్తవానికి ఇస్రో కార్యకలాపాలు పెరుగుతున్నాయని.. సాధారణ ఉత్పాదక కార్యకలాపాల కంటే భిన్నంగా వనరులను మరింతగా ఉపయోగించుకొని ఇస్రో మరింత ముందుకెళ్తుందని తెలిపారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని