వనపర్తి పోలీసుల తీరుపై కేటీఆర్‌ ఆగ్రహం
close

తాజా వార్తలు

Published : 02/04/2020 15:20 IST

వనపర్తి పోలీసుల తీరుపై కేటీఆర్‌ ఆగ్రహం

వనపర్తి: వనపర్తిలో ఓ వ్యక్తిపై పోలీసులు వ్యవహరించిన తీరుపై మంత్రి కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. కుమారుడితో కలిసి వెళ్తున్న ఓ వ్యక్తిని కొందరు పోలీసులు కింద పడేసి చితకబాదారు. దీనికి సబంధించిన దృశ్యాలను అక్కడే ఉన్న ఓ వ్యక్తి ట్విటర్‌ ద్వారా కేటీఆర్‌ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన కేటీఆర్‌.. ఎట్టిపరిస్థితుల్లోనూ పోలీసులు అలా ప్రవర్తించడం సరి కాదన్నారు. ఘటనపై విచారణ జరిపించాల్సిందిగా హోం మంత్రి మహమూద్‌ అలీ, డీజీపీని కోరారు. కొందరు పోలీసులు వ్యవహరిస్తున్న తీరుతో నిత్యం ఎంతో కష్టపడి సమర్థంగా విధులు నిర్వహిస్తున్న పోలీసులందరికీ చెడ్డ పేరు వస్తోందని కేటీఆర్‌ అసహనం వ్యక్తం చేశారు. అనంతరం ఈ ఘటనపై వనపర్తి జిల్లా ఎస్పీ అపూర్వారావు స్పందించారు. దీనికి సంబంధించి పోలీసుల తీరుపై పూర్తి స్థాయి విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని