
తాజా వార్తలు
‘తలైవా ఆట మొదలైంది’
రజనీ రాజకీయ అరంగేట్రంపై సినీ ప్రముఖుల హర్షం
చెన్నై: సుదీర్ఘ సందిగ్ధానికి తెరదించుతూ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారు తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్. వచ్చే ఏడాది జనవరిలో రాజకీయ పార్టీని ప్రారంభించనున్నట్లు గురువారం వెల్లడించారు. దీంతో తమిళనాట రజనీ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. అటు కోలీవుడ్ సినీ ప్రముఖులు కూడా తలైవా రాజకీయ అరంగేట్రంపై హర్షం వ్యక్తం చేశారు. విజయం మీదే అంటూ సోషల్‌మీడియా వేదికగా అభినందనలు తెలియజేస్తున్నారు. మరోవైపు రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీ రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. రజనీ ప్రకటన తర్వాత కొద్దిసేపటికే సామాజిక మాధ్యమాల్లో ‘మారుస్తాం.. అన్నీ మారస్తాం’.. ‘ఇప్పుడు జరగకపోతే ఎప్పటికీ జరగదు’ అని తమిళంలో ఉన్న హ్యాష్‌ట్యాగ్‌లో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి.
* ‘థ్యాంక్యూ తలైవా.. చాలా ఆనందంగా ఉంది. ఈ క్షణం కోసం ఎదురుచూస్తున్న మీ లక్షలాది మంది అభిమానుల్లో నేను కూడా ఉన్నాను. మీ కోరికలన్నీ నెరవేరాలని ఆ రాఘవేంద్ర స్వామిని ప్రార్థిస్తాను. ప్రస్తుతమున్న కఠినమైన కొవిడ్ పరిస్థితుల్లో మీ ఆరోగ్యాన్ని కూడా లెక్కచేయకుండా ప్రజలకు సేవ చేసేందుకు ముందుకొచ్చారు. మీ ఆశలు, ఆశయాలు తప్పకుండా నెరవేరుతాయి’ - రాఘవ లారెన్స్(దర్శకుడు, నటుడు)
* ‘ఇది ఆరంభం మాత్రమే.. తలైవా ఆట మొదలైంది’ - అనిరుధ్ రవిచంద్రన్(సంగీత దర్శకుడు)
* ‘రజనీ సర్.. ఎట్టకేలకు మీరు రాజకీయాల్లోకి అడుగుపెట్టడం ఆనందంగా ఉంది. ఈ కొత్త రంగంలో మీకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నా. ఎప్పటిలాగే మీరు రాజకీయాల్లో కూడా గొప్పగా పనిచేస్తారని నమ్మకంగా ఉన్నాం. గుడ్‌లక్ సర్ - ఖుష్బూ సుందర్(నటి, భాజపా నేత)
* ‘వావ్.. తలైవా రండి’ - కార్తిక్ సుబ్బరాజు(దర్శకుడు, నిర్మాత)
* ‘అభినందనలు తలైవా’- ఆర్కే సురేశ్(నటుడు, నిర్మాత)
* ‘ఇందులో మీరు అతిపెద్ద విజయం సాధించాలి తలైవా’ - నటుడు సతీశ్
* ‘గొప్ప వార్త.. రండి తలైవా’ - నటి హారతి
ఇవీ చదవండి..
తమిళ ప్రజల కోసం ప్రాణమైనా ఇస్తా
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- 2-1 కాదు 2-0!
- ఇబ్బంది లేకుండా ఎన్నికలు నిర్వహించండి: హైకోర్టు
- ఇక చాలు
- మీ పెద్దొళ్లున్నారే... :సెహ్వాగ్
- వైట్‌హౌస్‌లో విచిత్ర పెంపుడు జంతువులు!
- కొలిక్కి వచ్చిన దుర్గగుడి వెండి సింహాల కేసు
- రిషభ్ పంత్ కాదు.. స్పైడర్ పంత్: ఐసీసీ
- సాహో భారత్!
- కొవిడ్ టీకా అలజడి
- కీలక ఆదేశాలపై జో బైడెన్ సంతకం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
