
తాజా వార్తలు
బాయ్‌ఫ్రెండ్ గురించి కృతి కామెంట్
మేమిద్దరం రిలేషన్లో ఉండానికి కారణమదే..!
ముంబయి: ‘తీన్మార్’, ‘ఒంగోలుగిత్తా’ చిత్రాలతో ప్రేక్షకులను అలరించి.. తన నటనతో తెలుగు సినీ ప్రియులకు చేరువైన నటి కృతి కర్బంద. ప్రస్తుతం బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తున్న ఈ దక్షిణాది ముద్దుగుమ్మ నటుడు పులకిత్ సామ్రాట్‌తో గత కొన్నిరోజులుగా రిలేషన్లో ఉన్న విషయం తెలిసిందే. వీరిద్దరూ కలిసి పలు చిత్రాల్లో నటించారు. తాజాగా ఆమె తన బాయ్‌ఫ్రెండ్ పులకిత్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను బయటపెట్టారు. పులకిత్తో రిలేషన్లోకి వెళ్లడానికి గల కారణాన్ని ఆమె వివరించారు.
‘పులకిత్ మంచి నటుడు. సెట్లో ఉన్న ప్రతి ఒక్కర్నీ సమానంగా చూస్తాడు. ఓ టీమ్ ప్లేయర్లా అతను వ్యవహరించే తీరు నాకెంతో నచ్చుతుంది. అలాంటి మంచి నటుడికి ప్రేయసిని అయినందుకు గర్వంగా ఉంది. అతను సెట్లో ఉంటే ఎంతో సరదాగా అనిపిస్తుంది. గర్ల్‌ఫ్రెండ్‌ని కావడం వల్ల ఈ మాట చెప్పడం లేదు. సెట్లోని అన్ని విషయాల్లో అతని చొరవ వల్లే నేను మంచి స్నేహితురాలిని అయ్యాను. అనంతరం మేమిద్దరం రిలేషన్లోకి వచ్చాం. ఒకవేళ నా దృష్టిలో పులకిత్ మంచి నటుడు కాకపోతే.. మేమిద్దరం రిలేషన్లోకి వచ్చేవాళ్లం కాదు’ అని కృతి కర్బంద అన్నారు.