
తాజా వార్తలు
ఆగం కావొద్దు.. ఆలోచించండి: కేటీఆర్
హైదరాబాద్: నగరంలో వరదలు వచ్చినపుడు రాని కేంద్రమంత్రులు.. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారానికి మాత్రం గుంపులు గుంపులుగా వస్తున్నారని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ అన్నారు. దిల్లీ నుంచి సుమారు 12 మంది కేంద్రమంత్రులు వస్తున్నట్లు భాజపా నేతలు చెబుతున్నారని.. ఇక్కడ కేసీఆర్ సింహంలా సింగిల్‌గానే వెళ్తున్నారని వ్యాఖ్యానించారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా అల్వాల్ లయోలా కళాశాల రోడ్డు, యాప్రాల్ అంబేడ్కర్ చౌరస్తాలో నిర్వహించిన ఎన్నికల ప్రచార రోడ్‌షోలో కేటీఆర్ మాట్లాడారు. తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మల్కాజిగిరి పరిధిలో రూ.350 కోట్లతో మంచినీటి సమస్యను పరిష్కరించామన్నారు. గతంలో ఏడు, పదిరోజులకు ఓసారి నల్లా నీరు వచ్చేదని.. ఇప్పుడు రోజువిడిచి రోజు ఇస్తున్నామన్నారు.
సంక్షేమ పథకాలతో రాష్ట్ర ప్రజలను ఆదుకుంది తెరాస ప్రభుత్వమేనని కేటీఆర్ చెప్పారు. కేంద్ర ప్రభుత్వం మనకి ఇచ్చిందేమీ లేదని విమర్శించారు. రాష్ట్రానికి వచ్చే కేంద్రమంత్రులు ఉత్తి చేతులతో రావొద్దని.. సీఎం కేసీఆర్ కోరినట్లు రూ.1,350 కోట్ల వరదసాయాన్ని తీసుకు రావాలని వ్యాఖ్యానించారు. దిల్లీ నుంచి పొలిటికల్ టూరిస్టులు వస్తారని, వారితో ఏమీ కాదన్నారు. భాజపా నేతలు ఇష్టారీతిన మాట్లాడుతూ యువతను రెచ్చగొడుతున్నారని.. పచ్చగా ఉన్న హైదరాబాద్‌లో చిచ్చు పెట్టి ఆ మంటలో చలి కాచుకోవాలని భావిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. ప్రశాంతంగా ఉంటేనే హైదరాబాద్‌కు పెట్టుబడులు వచ్చి యువతకు ఉద్యోగాలు లభిస్తాయన్నారు. ఆగం కావొద్దు.. ఆలోచించండని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు.
ఇవీ చదవండి..
విద్వేషాలు రెచ్చగొడితే ఊరుకోం: కేటీఆర్
రెచ్చగొట్టే పోస్టులు ఫార్వర్డ్ చేయొద్దు: డీజీపీ
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- భారత్-ఎ జట్టుతో వాళ్లు గెలిచారు: పాంటింగ్
- కల లాంటిది.. నిజమైనది
- ఆసీస్ మాజీలూ.. ఇప్పుడేమంటారు?
- మెగాస్టార్ పాత ఫొటో.. గందరగోళంలో రమ్యకృష్ణ!
- మేం వస్తున్నాం.. టీమిండియా కాస్త జాగ్రత్త!
- గబ్బా హీరోస్.. సూపర్ మీమ్స్
- ఆ విశ్వాసంతోనే వెళ్లిపోతున్నా: ట్రంప్
- యువతిని హత్యచేసిన డిల్లీబాబు ఆత్మహత్య
- భలే పంత్ రోజు..
- ప్రపంచమంతా సెల్యూట్ చేస్తోంది: రవిశాస్త్రి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
