close

తాజా వార్తలు

Updated : 23/05/2020 21:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

తెలంగాణలో మరో 52 కరోనా కేసులు

హైదరాబాద్‌: తెలంగాణలో ఇవాళ మరో 52 మంది కరోనా బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. జీహెచ్ఎంసీ పరిధిలో 33 కేసులు నమోదుకాగా.. మరో 19 మంది వలస కార్మికులు కరోనా బారినపడినట్లు ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. దీంతో రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 1,813కు చేరింది. ఇవాళ కరోనా నుంచి కోలుకొని 25 మంది డిశ్చార్జ్‌ కాగా.. మొత్తంగా 1,068 మంది కోలుకొని ఇళ్లకు వెళ్లిపోయారు. ఇవాళ కరోనాతో ఒకరు మృతి చెందగా.. ఇప్పటివరకు 49 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 696 యాక్టివ్ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది.

రాష్ట్రంలో ఇప్పటివరకు వరంగల్‌ రూరల్‌, యాదాద్రి భువనగిరి, వనపర్తి జిల్లాల్లో ఒక్క కరోనా కేసూ నమోదు కాలేదని ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే రాష్ట్రంలోని 25 జిల్లాల్లో గత 14 రోజులుగా ఎవరూ కరోనా బారినపడలేదని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ పేర్కొంది.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన