close

తాజా వార్తలు

Published : 24/08/2020 00:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ప్రధాని ఇంట నెమలి నాట్యం..వీడియో వైరల్

దిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ప్రకృతి అంటే ఎంతో ప్రేమ. చాలా సందర్భాల్లో ఆయన దాని గురించి ప్రస్తావించారు. అంతే కాదు ఆయన ఇంటి సమీపంలో గార్డెన్‌లో యోగా, ధ్యానం చేసుకుంటున్న వీడియోలను సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకున్నారు. తాజాగా ఆయన మూగజీవాల పట్ల తనకున్న సాధుగుణాన్ని మరోసారి చాటుకున్నారు. తన ఇంటి ఆవరణలో సంచరిస్తున్న జాతీయ పక్షి నెమలిని మచ్చిక చేసుకుని దానికి ఆహారం తినిపిస్తున్న వీడియో ప్రధాని మోదీ ఆదివారం ఇన్‌స్టాగ్రాం, ట్విటర్‌లో షేర్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది.

ప్రధాని రోజువారీ దినచర్యలో భాగంగా ఆయన వాకింగ్ చేస్తున్నప్పుడు, కార్యాలయానికి వెళుతున్న సందర్భాలలో ఆయనకు స్వాగతం పలుకుతున్నట్లు మయూరం పురివిప్పి ఆడుతున్న దృశ్యాలను ఈ వీడియోలో చూడవచ్చు. అంతేకాకుండా ప్రధాని మోదీ తన నివాసంలో ఫైళ్లు చూస్తుండగా నెమళ్లు ఆయనకు దగ్గరగా సంచరింస్తున్నాయి. ఆయన వాటికి ఆహారం తినిపిస్తున్న దృశ్యాలు ప్రకృతితో ప్రధానికి ఉన్న అనుబంధానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. ప్రధాని షేర్‌ చేసిన ఈ వీడియోను చూసిన నెటిజన్లు విపరీతంగా లైక్‌ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ  వీడియోను సుమారు పది లక్షల మందికి పైగా ఇన్‌స్టాలో వీక్షించారు. ట్విటర్‌లో కూడా ప్రధానికి సాధుగుణాన్ని అభినందిస్తూ కామెంట్లు పెడుతున్నారు.    



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని