close

తాజా వార్తలు

Updated : 13/11/2020 13:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ముంబయి గెలవడానికి రోహిత్‌ లెక్క నిజమేనా? 

ఇది ఐపీఎల్‌ 2020 కాదు.. ఐపీఎల్‌ 13వ సీజన్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇటీవల దిల్లీ క్యాపిటల్స్‌పై గెలుపొందిన ముంబయి ఇండియన్స్‌ ఐపీఎల్‌లో ఐదోసారి టైటిల్‌ ఎగరేసుకుపోయింది. దీంతో ఆ జట్టుపై ఉన్న అపోహలను కొట్టివేస్తూ రోహిత్‌శర్మ ట్విటర్‌ వేదికగా సరదాగా స్పందించాడు. తాము ఈసారి టైటిల్‌ సాధించి సరి సంఖ్య ఏడాదిలోనూ విజేతగా నిలిచామని పేర్కొన్నాడు. అసలు విషయం ఏమిటంటే.. ముంబయి గతంలో 2013, 2015, 2017, 2019 బేసి సంఖ్య సంవత్సరాల్లోనే నాలుగుసార్లు టైటిల్‌ సాధించింది. దీంతో ఆ జట్టు బేసి సంఖ్య సంవత్సరాల్లోనే గెలుస్తుందనే అభిప్రాయం అభిమానుల్లో బలంగా నాటుకుపోయింది. అందుకు సంబంధించిన ఒక యాడ్‌ కూడా మార్చిలో లాక్‌డౌన్‌కు ముందు విడుదల చేశారు.

అందులో నిద్రపోతున్న రోహిత్‌ను ఒకతను మేల్కొలిపి ముంబయి విజయంపై సరి-బేసి అపోహలను గుర్తుచేస్తాడు. అలాగే హిట్‌మ్యాన్‌ జెర్సీ నంబర్‌ కూడా 45కి 46గా మార్చికుంటే బాగుండు అన్నట్లు ఒక సూచన చేస్తాడు. అందుకు స్పందించిన రోహిత్‌.. ముంబయి విజయానికి బేసి సంఖ్యే అవసరమైతే ఈ ఏడాది కూడా తమకు కలిసి వస్తుందని అంటాడు. అదెలాగంటే ఇది కేవలం ఐపీఎల్‌ 2020 మాత్రమే కాదని, ఇది ఐపీఎల్‌ 13వ సీజన్‌ కూడానని గుర్తుచేస్తాడు. కాగా, ఈ యాడ్‌ విడుదలైన కొద్ది రోజులకే కరోనా పరిస్థితుల ప్రభావంతో లాక్‌డౌన్‌ విధించగా మార్చి 29న ప్రారంభంకావాల్సిన లీగ్‌ ఆరు నెలలు వాయిదా పడి చివరికి యూఏఈలో సెప్టెంబర్‌ 19న ప్రారంభమైంది. ఈ క్రమంలోనే ముంబయి ఐదోసారి విజేతగా నిలవడమే కాకుండా ఆ జట్టు విజయాలపై ఉన్న అపోహలను తొలగించుకుంది. దాంతో రోహిత్‌ ఆ పాత యాడ్‌ను తన ట్విటర్‌లో పోస్టు చేసి.. ఈసారి తాము విజేతగా గెలిచి చూపించామని స్పష్టం చేశాడు. 


Tags :
జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని