ఇవాళ రాత్రి అత్యంత కీలకం
close

తాజా వార్తలు

Updated : 30/11/2020 23:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇవాళ రాత్రి అత్యంత కీలకం

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం

హైదరాబాద్‌: గ్రేటర్‌ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు అభ్యర్థులు అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం అభిప్రాయపడింది.  ఈ విషయంలో సోమవారం రాత్రి  ఎన్నికల పరిశీలకులు ప్రత్యేకంగా దృష్టి సారించాల్సి ఉందని పేర్కొంది. ఫ్లయింగ్‌స్క్వాడ్స్‌, స్టాటిక్‌ సర్వేలెన్స్‌ బృందాలను అప్రమత్తం చేయాలని,ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా.. వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని వెల్లడించింది. చట్టప్రకారం కేసులు నమోదు చేసి.. చర్యలు తీసుకోవాలని తెలిపింది.
గ్రేటర్‌లో సోమవారం ఒక్కరోజు రూ.2.2లక్షల నగదు, రూ.19.68లక్షల విలువైన మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఇప్పటివరకు రూ.1.48కోట్ల నగదు, రూ.34.37లక్షల విలువైన మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇవాళ 45 కేసులను నమోదు చేశారు ఎన్నికల సంఘం అధికారులు. ఈ నేపథ్యంలో ఎన్నికలు పారదర్శకంగా జరిగేలా చూడాలని కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల సంఘాన్ని కోరింది. గ్రేటర్‌లో డబ్బు పంపిణీ జరుగుతోందని ఈ-మెయిల్‌ ద్వారా కాంగ్రెస్‌ ఈసీకి ఫిర్యాదు చేసింది.

 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని