close

తాజా వార్తలు

కుటుంబానికి పెద్ద కొడుకులాగే పనిచేశా!

రోడ్‌షోలో సీఎం కేజ్రీవాల్‌

దిల్లీ: దేశ రాజధాని హస్తినలో ఎన్నికల వేడి కొనసాగుతోంది. ఎన్నికల పోలింగ్‌కు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో గెలుపే లక్ష్యంగా అధికార, విపక్ష పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ప్రజా సంక్షేమానికి తాము చేసిన పనులను వివరిస్తూ.. తమదైన శైలిలో ప్రజల్ని ఆకట్టుకొనేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. ఇందులో భాగంగా బుధవారం ఆప్‌ కన్వీనర్‌, సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ గత ఐదేళ్లలో తమ ప్రభుత్వం ప్రజల కోసం చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. బుధవారం ఆయన బాద్లి నియోజకవర్గంలో ఆప్‌ అభ్యర్థి అజేష్‌ యాదవ్‌కు మద్దతుగా నిర్వహించిన రోడ్‌షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్‌ మాట్లాడుతూ.. ఇప్పటికే ప్రజల సంక్షేమమే పరమావధిగా అనేక పనులు చేశామన్నారు. 70 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న పనుల్ని పూర్తి చేయాలంటే తమకు మరికొంత సమయం కావాలని తెలిపారు. దిల్లీ ప్రజల జీవితాల్లో సంతోషం నింపడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం ఎంతో కృషిచేసిందని చెప్పారు.

ఇప్పటికే తాగునీరు, ఉచిత విద్యుత్తు, విద్య, ఆరోగ్య వ్యవస్థలను మెరుగు పరచడం వంటి కార్యక్రమాలు చేపట్టినట్టు వివరించారు. అయితే, 70 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న పనులు కేవలం ఐదేళ్ల వ్యవధిలోనే పూర్తికావన్నారు. అందువల్ల తమకు మరింత సమయం కావాలని ప్రజలను కోరారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కుటుంబానికి పెద్ద కొడుకులా పనిచేశానని చెప్పుకొచ్చారు. ఇంటికి పెద్ద కొడుకులా కుటుంబ బాధ్యతలను భుజాలపై మోయడం..  అందరి బాగోగులు చూసుకోవడం వంటి కార్యక్రమాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు సీఎం చెప్పగానే ప్రజలు చప్పట్లు, హర్షధ్వానాలతో మార్మోగించారు. దిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరి 8న ఎన్నికలు జరగనుండగా.. 11న ఫలితాలు వెల్లడికానున్నాయి. 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.