close

తాజా వార్తలు

Published : 21/07/2020 20:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

వాళ్లెవరూ నాతో సినిమా చేయలేదు: అనురాగ్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: తన సినిమాలను బాలీవుడ్‌లోని పెద్ద స్టూడియోలేవీ నిర్మించలేదని అంటున్నాడు బాలీవుడ్‌ దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌. ఓ నెటిజన్‌ ట్విటర్‌లో తనను విమర్శించడంతో ట్విటర్‌లోనే అనురాగ్‌ సమాధానం చెప్పాడు. బాలీవుడ్‌లో మూవీ మాఫియా రాజ్యమేలుతుందని నటి కంగనా రనౌత్‌ చేసిన వ్యాఖ్యలు సినీ పరిశ్రమలో దుమారం రేపుతున్నాయి. కంగన వ్యాఖ్యలను పలువురు సినీ ప్రముఖులు, నెటిజన్లు సమర్థిస్తున్నారు. ఈ నేపథ్యంలో నటుడు రణ్‌వీర్‌ షోరే ఓ ట్వీట్ చేశారు. ‘‘కొందరు ఇండిపెండెంట్‌ చిత్రాలు తీసే వారు.. ఇప్పుడు బాలీవుడ్‌లో సినిమాలు చేస్తున్నారు. ఈ అవకాశాలు రాకముందు వీరే బాలీవుడ్‌ వ్యవస్థపై రకరకాలుగా మాట్లాడేవారు’’అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు. వీరి మధ్య చిన్నపాటి మాటల యుద్ధం జరిగింది.

అయితే రణ్‌వీర్‌ షోరే చేసిన ట్వీట్‌కు స్పందిస్తూ ఓ నెటిజన్‌.. బాలీవుడ్‌ గ్యాంగ్‌ మాఫియా చేతిలో కీలుబొమ్మకు బాలీవుడ్‌ దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ మంచి ఉదాహరణ అని ట్వీట్‌ చేశాడు. రోటీ చేయాలంటే పిండి పట్టాల్సిందే అంటూ సినిమాల్లో నిలదొక్కుకోవాలంటే మాఫియాను సంతృప్తి పర్చాలి అనే కోణంలో వ్యంగ్యంగా ట్వీట్‌ చేశాడు. నెటిజన్‌ ట్వీట్‌కు అనురాగ్‌ కశ్యప్‌ కాస్త ఆగ్రహానికి లోనయ్యాడు. 

‘‘నా రోటీ బాలీవుడ్‌తో కలిసి పని చేయదు. ధర్మ, ఎక్సెల్‌, యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ వంటి పెద్ద స్టూడియోలేవీ నా సినిమాలను నిర్మించలేదు. నేను సినిమా చేయాలంటే నేనే సొంతంగా కంపెనీ ఏర్పాటు చేసుకోవాలి’’అని అన్నాడు. కంగనా రనౌత్‌ గురించి ప్రస్తావిస్తూ ‘‘కంగనకు సినిమా అవకాశాలు లేనప్పుడు ‘క్వీన్‌’ సినిమాను నిర్మించాం. ఆమె నటించిన ‘తను వెడ్స్‌ మను’ సినిమా ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే.. దర్శకుడు ఆనంద్‌ రాయ్‌కు ఫైనాన్షియర్స్‌ను పరిచయం చేసి సినిమా పూర్తయ్యేలా చేశా. కావాలంటే మీరే వెళ్లి అడగండి’’అని అనురాగ్‌ కశ్యప్‌ ట్వీట్‌లో పేర్కొన్నాడు. బ్లాక్‌ఫ్రైడే, బాంబే టాకీస్‌, బాంబే వెల్వెట్‌, రామన్‌ రాఘవ్‌ 2.0 వంటి చిత్రాలను తెరకెక్కించిన అనురాగ్‌ ప్రస్తుతం వెబ్‌సిరీస్‌లపై దృష్టిపెట్టాడు. లస్ట్‌ స్టోరీస్‌, ఘోస్ట్‌ స్టోరీస్‌ వంటి వెబ్‌సిరీస్‌లతోపాటు ‘చోక్డ్’ అనే వెబ్‌ ఫిల్మ్‌ కూడా తీశాడు. 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

Panch Pataka

దేవతార్చన