close

తాజా వార్తలు

Published : 23/12/2020 09:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రాజధాని పోరులో ఆగిన మరో రైతు గుండె​​​​​​​

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌కు ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని పోరాటం చేస్తున్న రైతుల్లో మరొకరి గుండె ఆగింది. తుళ్లూరు మండలం తాళ్లాయపాలెంనకు చెందిన కొండెపాటి పెద్ద పకీరయ్య గుండెపోటుతో మృతి చెందారు. రాజధానికోసం పకీరయ్య తన 3 ఎకరాల పొలాన్ని ఇచ్చారు. వైకాపా అధికారంలోకి వచ్చాక ఏపీకి మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకురావడంతో రాజధాని రైతులు ఏడాదికి పైగా ఉద్యమం చేస్తున్నారు. 

రాజధాని ఉద్యమంలో ఇప్పటికే పలువురు రైతులు ప్రాణాలు కోల్పోయారు. రైతు దినోత్సవం అయిన ఇవాళ రైతు పకీరయ్య మృతిచెందటం పట్ల తోటి కర్షకులు కన్నీటి పర్యంతమయ్యారు. ఏపీకి రాజధానిగా అమరావతినే కొనసాగించాలని మందడం దీక్షా శిబిరంలో పకీరయ్య రోజూ తన పిల్లలతో కలిసి దీక్షలో పాల్గొనేవారని చెబుతున్నారు. అమరావతి పోరాటంలో మూడు రోజుల కిందటే ఇద్దరు రైతులు గుండెపోటుతో మృతిచెందిన విషయం తెలిసిందే. 

ఇదీ చదవండి.. 
కత్తితో పొడుచుకున్న కౌలు రైతు



Tags :
జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని