close

తాజా వార్తలు

Published : 30/11/2020 22:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

వేగంగా పుంజుకుంటున్న చైనా ఉత్పత్తిరంగం!

బీజింగ్‌: కరోనా మహమ్మారి నుంచి కోలుకున్న చైనాలో పారిశ్రామిక రంగం క్రమంగా పుంజుకుంటోంది. అందులో భాగంగా నవంబరులో ఉత్పత్తి కార్యకలాపాల్లో భారీ వృద్ధి నమోదైంది. అదే అమెరికా సహా ఐరోపా దేశాల్లో కరోనా విజృంభణ ఇంకా కొనసాగుతుండడంతో ఆర్థిక వ్యవస్థ ఇంకా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. 

చైనాలో నెలవారీ ‘పర్చేజింగ్‌ మేనేజర్స్‌ ఇండెక్స్‌’ 52.1 పాయింట్లకు చేరినట్లు అక్కడి అధికారిక గణాంకాలు తెలిపాయి. అక్టోబరులో ఇది 51.4 పాయింట్లుగా ఉండింది. ఈ సూచీ 50 పాయింట్లు దాటితే వృద్ధిని సూచిస్తుంది. మార్చిలో కరోనా వ్యాప్తి అదుపులోకి వచ్చినట్లు ప్రభుత్వం ప్రకటించిన తర్వాత చైనాలో వ్యాపార కార్యకలాపాలు క్రమంగా పుంజుకుంటూ వచ్చాయి. దీంతో ఉత్పత్తి రంగం సైతం ఊపందుకుంది. ఫ్యాక్టరీలు, కార్యాలయాలు, దుకాణాలు తెరుచుకున్నాయి. ప్రయాణాలపై కొద్ది మేర ఆంక్షలు ఉన్నప్పటికీ రిటైల్‌ వ్యయాలు, వాహన విక్రయాలు, పారిశ్రామిక ఉత్పత్తి కొవిడ్‌ మునుపటి స్థాయికి చేరుకున్నాయి.  

సేవా రగం, ఉత్పత్తి రంగాల్లో భారీ వృద్ధి నమోదుకావడంతో నవంబరులో చైనా ఆర్థిక పరిస్థితి సైతం మెరుగైందని ఓ అధికారిక నివేదిక పేర్కొంది. ప్యాక్టరీ ఉత్పత్తిని తెలిపే సూచీ నవంబరులో 54.7 శాతానికి ఎగబాకిందని తెలిపింది. అక్టోబరులో 1.1 పాయింట్లుగా ఉన్న కొత్త ఆర్డర్ల ఇండెక్స్‌ ఏకంగా 53.9 పాయింట్లకు పెరిగినట్లు వెల్లడించింది. ప్రపంచ దేశాలన్నీ లాక్‌డౌన్‌ దిశగా వెళుతున్న తరుణంలో చైనా మార్కెట్లు తెరుచుకోవడం అక్కడి పరిశ్రమలకు కలిసొచ్చిందని తెలిపింది. అనేక దేశాల్లో ఇంకా ఆంక్షలు కొనసాగుతుండడంతో చైనా కంపెనీలు దీన్ని అనుకూలంగా మలుచుకుంటున్నాయని పేర్కొంది.


Tags :
జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని