కలకలం రేపిన కౌలు రైతు ఆత్మహత్యాయత్నం
close

తాజా వార్తలు

Published : 22/12/2020 14:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కలకలం రేపిన కౌలు రైతు ఆత్మహత్యాయత్నం

గుంటూరు : గుంటూరు జిల్లాలో సలీం అనే కౌలు రైతు పొలంలోనే కత్తితో పొడుచుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. వేమూరు మండలం పోతుపర్రు గ్రామానికి చెందిన సలీం అనే కౌలు రైతు అదే గ్రామంలోని పద్మావతి అనే మహిళకు చెందిన 7.4 ఎకరాల పొలాన్ని  కౌలుకు తీసుకుని సాగు చేశాడు. కాగా, ఆ పొలం యాజమాన్య హక్కుల విషయంలో పద్మావతి, శివారెడ్డి అనే వ్యక్తికి మధ్య వివాదం నడుస్తోంది. పద్మావతి భర్త ఈ పొలాన్ని 2012లో తనకు విక్రయించినట్లు శివారెడ్డి చెబుతున్నారు. దీనికి సంబంధించి కోర్టులో కేసు నడుస్తోంది. కోర్టు ఆదేశాలమేరకు పొలంలో సాగు చేసిన పంటను కోసేందుకు రెవెన్యూ, పోలీసు అధికారులు సిద్ధమయ్యారు. 

అధికారులు పంట కోస్తే.. పొలంలోనే తాను ఆత్మహత్య చేసుకుంటానని సోమవారం రాత్రి  కౌలు రైతు సలీం సెల్ఫీ వీడియో విడుదల చేశారు. ఇవాళ ఉదయం రెవెన్యూ, పోలీసు అధికారులు పొలం వద్దకు చేరుకోగానే సలీం కత్తితో పొడుచుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. దీంతో స్థానికులు సలీం ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. అప్పటికే అతడు కత్తితో పొడుచుకున్నాడు. పోలీసులు సలీంను ఆస్పత్రికి తరలించేందుకు యత్నించగా నిరసన తెలిపాడు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా తన గోడు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. అనంతరం బాధితుడిని తెనాలిలోని ఓ ఆస్పత్రికి తరలించి   చికిత్స అందిస్తున్నారు. 


ఇవీ చదవండి..

సిస్టర్‌ అభయ కేసు.. 28 ఏళ్ల తర్వాత తీర్పు

రైనాను అరెస్టు చేసిన ముంబయి పోలీసులు


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని