close

తాజా వార్తలు

Published : 22/02/2020 01:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పుట్టింటికివెళ్లనీయడం లేదు!

ముప్పై ఏళ్ల క్రితం మా సంఘం ద్వారా మా తాతయ్యకి ప్రభుత్వం నుంచి మూడు ఎకరాల భూమి వచ్చింది. దాన్ని ఇప్పుడు నాన్న, బాబాయ్‌ పంచుకున్నారు. ఈ భూమిని సంఘం వాళ్లు వెనక్కి ఇచ్చేయమంటున్నారు. మావాళ్లు దీనికి అంగీకరించలేదు. అందుకు సంఘం నుంచి తీసేశారు. మా ఊర్లోని అబ్బాయితోనే నాకు పెళ్లైంది. సంఘం నుంచి మా వాళ్లను తీసేయడంతో మా అమ్మానాన్నల దగ్గరికి ఎవరినీ వెళ్లనివ్వడం లేదు. ఒకవేళ వెళ్తే రూ.50 వేల జరిమానా కట్టాలి. నేను మా పుట్టింటికి వెళ్తానంటే మా మామయ్యని భయపెడుతున్నారు. జరిమానా కట్టాలని ఆంక్షలు విధిస్తున్నారు. అమ్మవాళ్లను కలిసి ఏడు నెలలవుతోంది. నేనేం చేయాలి? సలహా ఇవ్వగలరు?

- ఓ సోదరి

మీ సంఘం నిబంధనలు ఏమిటో తెలియడం లేదు. ప్రభుత్వం కుల సంఘం ద్వారా ఇచ్చే భూమి అసైన్‌మెంట్‌ ఆఫ్‌ ల్యాండ్‌ రూల్స్‌ కిందికి వస్తుంది. దీని ప్రకారం తండ్రికి చెందిన అసైన్డ్‌ భూమి కొడుకులకు వారసత్వంగా వస్తుంది. కానీ మీ సంఘం వాళ్లు తిరిగి ఇచ్చేయ్యాలని అంటున్నారంటే... సంఘం నియమాల్లో ఇలాంటి నిబంధన ఏదైనా ఉందేమో తెలుసుకోండి. లేకుంటే మీరు న్యాయస్థానాల్లో ప్రశ్నించవచ్ఛు మిమ్మల్ని పుట్టింటికి వెళ్లకుండా ఆంక్షలు విధించడం, మీ మామగారిని జరిమానా కట్టాలని హెచ్చరించడం... ఇదంతా అన్యాయం. ఇది మానవ హక్కుల ఉల్లంఘన కిందికి వస్తుంది. దీనిమీద మీరు హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేయండి. సంఘం అందులోని సభ్యులందరికీ సహాయపడాలి. కానీ ఇలా కట్టడి చేసి ఆడపిల్లలను ఇబ్బంది పెట్టకూడదు. ముందుగా మిమ్మల్ని పుట్టింటికి వెళ్లకుండా ఆంక్షలు విధించే వారిపై పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయండి. వాళ్లు రాంగ్‌ఫుల్‌ కన్‌ఫైన్‌మెంట్‌ కింద అరెస్టు చేస్తారు. కనీసం స్టేషన్‌కు పిలిపించి మాట్లాడుతారు. ఐపీసీ సెక్షన్‌ 347 ప్రకారం ఒకరి నుంచి రావాల్సిన డబ్బు, ఆస్తి కోసం వారిని బంధించడం నేరం. పుట్టింటికి వెళ్లకుండా శాసించడం ఏ సంఘానికి చెల్లదు. మీకు కుల సంఘంలోని తీర్పులతో ఎటువంటి సంబంధం లేదు. మీ రాకపోకలను అడ్డుకునే హక్కు వారికి లేదు. మీరు ముందుగా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు ఇవ్వండి. న్యాయం జరగకపోతే హైకోర్టులో రిట్‌ వేయండి. మీ వ్యక్తిగత హక్కులకు భంగం కలిగిస్తున్నారని కోర్టు వారికి విన్నవించండి. మీకు న్యాయం జరుగుతుంది.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని