
తాజా వార్తలు
క్విజ్.. క్విజ్..
1. సంవత్సరానికి 365 రోజులు. మరి 366 రోజులుంటే దాన్ని ఏమని పిలుస్తారు?
2. చేపలు నీటిలోని ఆక్సిజన్‌ను వేటి సాయంతో తీసుకుంటాయి?
3. ఇంద్రధనుస్సులో ఎన్ని రంగులు ఉంటాయి?
4. అతిపెద్ద ఖండం ఏది?
5. ఏ పండుకు విత్తనాలు లోపల కాకుండా బయట ఉంటాయి?
చెప్పుకోండి చూద్దాం
చంటి.. బంటి.. చింటు అనేవి మూడు ఏనుగులు. ఈ మూడూ నడుచుకుంటూ వెళుతున్నాయి. చంటి అనే ఏనుగు నా వెనక రెండు ఏనుగులు ఉన్నాయంది. బంటి అనే ఏనుగూ నా వెనక కూడా రెండు ఏనుగులు ఉన్నాయంది. చింటు అనే ఏనుగు కూడా నా వెనక రెండు ఏనుగులు ఉన్నాయంది? ఇదెలా సాధ్యం?
పొడుపు కథలు
1. ఎర్రటి పండు.. ఈగైనా వాలని పండు?
2. రూపు కారు నలుపు.. చిరాకు
తెప్పించు దాని అరుపు?
3. నున్నటి బండమీద నల్లనువ్వులు ఎండబోస్తే, నాలుక లేని పాము నాక్కొని పోయె?
అరరె.. నిజమే కదా!
అనగనగా ఓ ఊరు. ఆ ఊరిలో ఓ ఇల్లు. ఇంటిలో ఒక పే..ద్ద గంప ఉంది. గంప పైన బుట్ట ఉంది. బుట్టపైన బిందె ఉంది. బిందెపైన ఒక పంజరం ఉంది. పంజరంలో కోడిపుంజు గుడ్డు పెడితే ఎక్కడ పడుతుంది? పడితే పగులుతుందా? పగలదా?!
పట్టికలో పదాలు
ఇక్కడి పదాలు పట్టికలో ఉన్నాయి. కనుక్కోండి చూద్దాం!
december, august, april, saturday, tuesday, november, july, march, friday, monday, october, june, february, thursday,sunday, september, may, january, wednesday.
రాయగలరా?
ఇక్కడ కొన్ని చిత్రాలున్నాయి. వాటికి కేటాయించిన గడుల్లో పేర్లు రాయగలరా?
6 తేడాలు కనుక్కోండి
జవాబులు:
క్విజ్.. క్విజ్..: 1.లీపుసంవత్సరం 2.మొప్పలు 3.ఏడు 4.ఆసియా 5.స్ట్రాబెర్రీకి..
తేడాలు కనుక్కోండి: పక్షి, పురుగు, కుందేలు చెవి, చెట్టుకింద పొద, చెట్టు వేరు, సూచికకర్ర
రాయగలరా: నిలువు: 1.jeans 2.jellybeans 3.jump 4.juice 6.jelly అడ్డం: 2.jaguar 3.jellyfish 4.janitor 5.jet 6.jungle
చెప్పుకోండి చూద్దాం: ఈ మూడు ఏనుగులూ వృత్తాకారంలో నడుస్తున్నాయి!
అరరె.. నిజమే కదా!: ఎక్కడా పడదు. (అసలు కోడిపుంజు గుడ్డు పెట్టదు కదా)
పొడుపు కథలు: 1.నిప్పు 2.కాకి 3. గడ్డం, గుండు గీసే కత్తి
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- ఆప్త నేస్తాలు.. ఆఖరి మజిలీ!
- ‘నా మృతదేహాన్ని వాటికి ఆహారంగా వేయండి’
- క్షమించు నాన్నా..నిను వదిలి వెళ్తున్నా!
- రోహిత్‌ను సరదాగా ట్రోల్ చేసిన డీకే
- చరిత్ర సృష్టించిన నయా యార్కర్ కింగ్
- కన్నీటి పర్యంతమైన మోదీ
- సికింద్రాబాద్‌లో భారీగా బంగారం చోరీ
- కంగారూను పట్టలేక..
- రెరా మధ్యే మార్గం
- ప్రధాని సూచన మేరకే ఆ నిర్ణయం: కేటీఆర్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
