చారిత్రక కథతో?
close

తాజా వార్తలు

Published : 24/06/2020 21:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చారిత్రక కథతో?

‘ఎమ్‌.సి.ఎ’ చిత్రంతో సందడి చేసిన జోడీ... నాని, సాయిపల్లవి. ఆ ఇద్దరూ మరోసారి కలిసి నటించబోతున్నారు. నాని కథానాయకుడిగా, రాహుల్‌ సంక్రిత్యాన్‌ దర్శకత్వంలో ‘శ్యామ్‌ సింగ రాయ్‌’ తెరకెక్కబోతోంది. సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఆగస్టులో సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ సినిమా కోసం ప్రస్తుతం కథానాయికల ఎంపిక జరుగుతోంది.

ఇందులో ముగ్గురు కథానాయికలకి చోటుంది. ఓ కథానాయికగా సాయిపల్లవి ఎంపికైంది. ఇటీవలే కథ విన్న ఆమె సినిమాకి పచ్చజెండా ఊపారని సినీ వర్గాలు వెల్లడించాయి. మరో ఇద్దరు కథానాయికల ఎంపిక కోసం చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. ఇదొక చారిత్రక కథతో తెరకెక్కుతున్నట్టు సమాచారం.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని