
తాజా వార్తలు
చార్మినార్‌పై సమంత యోగా: ఫన్నీ మీమ్స్
హైదరాబాద్: చార్మినార్‌పై సమంత యోగా చేయడం ఏంటా? అని ఆలోచిస్తున్నారా? ఫిట్నెస్ విషయంలో అగ్ర కథానాయిక సమంత ఏమాత్రం అశ్రద్ధ చూపరు. రోజులో కొంత సమయాన్ని తప్పకుండా వ్యాయామానికి కేటాయిస్తారు. తన అభిమానులను సైతం ఈ విషయంలో అప్రమత్తం చేస్తుంటారు. లాక్డౌన్ కారణంగా ప్రస్తుతం ఇంట్లోనే ఉంటున్న సామ్ తన భర్త చైతన్యతో కలిసి యోగా చేస్తూ, పోషక విలువలతో కూడిన వంటలను నేర్చుకుంటున్నారు. ఆ ఫొటోలను సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు. తాజాగా యోగా, ఆసనాలు వేసిన ఫొటోలను షేర్చేశారు.
దీంతో ఆమె అభిమానులు వాటితో ఫన్నీ మీమ్స్ చేసి సోషల్‌మీడియాలో పంచుకుంటున్నారు. చార్మినార్, కొండారెడ్డి బురుజు సెంటర్లపై సమంత యోగాసనం చేసినట్లు క్రియేట్ చేశారు. అలాగే స్పెడర్ మ్యాన్ పోస్టర్‌ను సమంత ఆసనాలతో రీడిజైన్ చేశారు. ‘స్పైడర్ సమంత’ అంటూ వీటిని సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయడంతో వైరల్ అవుతున్నాయి. ఇవి చూసిన సామ్ ఆ మీమ్స్‌ను తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పెట్టుకుని తెగ మురిసి పోయారు.
సమంత ‘జాను’ సినిమాతో ఈ ఏడాది ఆరంభంలో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తమిళ హిట్ ‘96’కు తమిళ రీమేక్‌గా వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. దీని తర్వాత ఆమె తొలిసారి ‘ది ఫ్యామిలీ మెన్ 2’అనే వెబ్ సిరీస్‌లో ప్రతినాయకురాలిగా నటించారు. ఇది విడుదలకు సిద్ధమవుతోంది.
ఇక నాగచైతన్య కథానాయకుడిగా విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కబోతోంది. ఈ చిత్రానికి ‘థ్యాంక్ యూ’ అనే పేరుని పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం చిత్రబృందం కథానాయిక ఎంపికపై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. నాగచైతన్య సరసన ఆయన అర్థాంగి సమంత నటించే అవకాశాలున్నట్టు సమాచారం.