close

తాజా వార్తలు

Updated : 29/11/2020 08:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రాష్ట్రస్థాయి పదవి ఉన్నా నిలువ నీడలేదు

మత్స్య కార్పొరేషన్‌ డైరెక్టర్‌ వేదన

కొత్తపల్లి: ఆమె రాష్ట్ర మత్స్యకార కార్పొరేషన్‌ డైరెక్టర్‌. ఎంపీటీసీ మాజీ సభ్యురాలు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మెచ్చిన నాయకురాలు. ఆమె ఉప్పాడకు చెందిన తోటకూర మారెమ్మ. ఎంతమందిలో ఉన్నా ముఖ్యమంత్రే స్వయంగా గుర్తించి పిలిచి పలకరిస్తారు. అందుకే మత్స్యకార వర్గంలో ఎంతో మంది బడా నాయకులు ఉన్నా పక్కనపెట్టి మారెమ్మకు రాష్ట్ర స్థాయి పదవి అప్పగించారు. ఒక ముఖ్యమంత్రి వద్ద ఇంత అభిమానం సంపాదించిన ఆమెకు ఇప్పుడు నిలువ నీడలేదు. మారెమ్మకు నలుగురు కుమార్తెలు. నలుగురికి వివాహం చేయగా, ఇద్దరు పలు కారణాల వల్ల ఆమెతోనే ఉంటున్నారు. ఈమెకున్న ఒక్క ఇల్లు నివర్‌ తుపాను ప్రభావంతో కెరటాల తీవ్రతకు సముద్ర గర్భంలో కలిసిపోయింది. నాలుగు రోజులుగా ఎక్కడ ఉండాలో తెలియక సామగ్రిని తెలిసినవారి ఇంట్లో ఉంచింది. ఆమె మాత్రం బస్‌ షెల్టర్‌లో తలదాచుకుంటుంది. పేరుకు రాష్ట్రస్థాయి పదవి ఉన్నా తన పరిస్థితి చాలా దారుణంగా ఉందని వాపోతోంది.

ఎవరూ పట్టించుకోలేదు: తోటకూర మారెమ్మ, రాష్ట్ర మత్స్యకార కార్పొరేషన్‌ డైరెక్టర్‌

వైకాపా ఏర్పడినప్పటి నుంచి పార్టీ బలోపేతం కోసమే కృషి చేశా. నేనంటే జగన్‌బాబుకు చాలా ఇష్టం. నామీద అభిమానంతోనే ఆయన నాకు డైరెక్టర్‌ పదవి అప్పగించారు. ప్రస్తుతం నా ఇల్లు సముద్రంలో కలిసిపోయి రోడ్డున పడ్డాను. నాలుగు రోజులుగా సాయం కోసం పిచ్చిదానిలా తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. రాజకీయంగా పదవులు చేపట్టినా ఒక్క రూపాయి సంపాదించుకోలేదు. బిడ్డలాంటి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డే నన్ను ఆదుకోవాలి.


Tags :

జనరల్‌

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని