నగ్నచిత్రాల వీడియో కేసులో మరో ఇద్దరు!
close

తాజా వార్తలు

Published : 05/07/2020 09:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నగ్నచిత్రాల వీడియో కేసులో మరో ఇద్దరు!

ఒకరు తెనాలికి చెందిన యువకునిగా గుర్తింపు

హైదరాబాద్‌లో పట్టుబడిన మరో కుర్రాడు

గుంటూరు: గుంటూరుకు చెందిన ఇంజినీరింగ్‌ విద్యార్థిని నగ్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌, అశ్లీల వెబ్‌సైట్‌లో పోస్టు చేసిన కేసులో తాజాగా ఇద్దరు యువకులను గుర్తించారు. వీరిలో ఒకరిది తెనాలి కాగా మరొకరిది గుంటూరుగా తెలిసింది. ‘మె ౖనేమ్‌ ఈజ్‌ 420’ పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన యువకుడి ఆచూకీని పోలీసులు చేధించినట్లు సమాచారం. బాధిత విద్యార్థిని, నిందితులు, తాజాగా చిక్కిన ఇద్దరు యువకులు వీరంతా కలిసి ఒకే కళాశాలలో చదువుకున్నారని చెబుతున్నారు. తెనాలి యువకుడు ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టగా మరో యువకుడు దాన్ని పలువురికి షేర్‌ చేశారని పోలీసుల విచారణలో తేలింది. రిమాండ్‌లో ఉన్న ఏ1, ఏ2 వరుణ్‌తేజ్‌, కౌశిక్‌లు ఇచ్చిన సమాచారం ఆధారంగా ప్రస్తుతం ఈ ఇద్దరు యువకుల ప్రమేయాన్ని గుర్తించి ఆమేరకు వారికి తాఖీదులు ఇచ్చి విచారణకు పిలిచారు. వీడియోను షేర్‌ చేసిన యువకుడు హైదరాబాద్‌లో సినిమా రంగంలో ఉన్నారని తెలుసుకుని అతన్ని శుక్రవారం హైదరాబాదులో అదుపులోకి తీసుకుని ఇక్కడికి తీసుకొచ్చారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని