
తాజా వార్తలు
నిధి కోసం శివలింగం ధ్వంసం
బళ్లారి: తాలూకాలో హలకుంది గ్రామ ప్రజలు ఆరాధ్యదైవంగా కొలిచే రామలింగేశ్వర దేవస్థానంలో శివలింగాన్ని గుర్తుతెలియని దుండగులు నిధి కోసం ధ్వంసం చేశారు. గ్రామానికి ఉత్తరం వైపు ఉన్న కొండపై పురాతన రామలింగేశ్వర దేవస్థానం ఉంది. శనివారం రాత్రి దుండగలు ఈ ఆలయానికి చేరుకుని నిమ్మకాయలు, పసుపు, కుంకుమతో పూజలు నిర్వహించారు. గర్భగుడిలో శివలింగానికి చుట్టూ ఉన్న కవచాన్ని తొలగించి సుమారు నాలుగు అడుగుల ఎత్తైన శివలింగాన్ని బయటకు తీశారు. చుట్టుపక్కల బండ్లను కూడా తొలగించారు. ఆదివారం ఉదయం ఈ విషయం గ్రామస్థులకు తెలియడంతో వారిచ్చిన సమాచారం మేరకు గ్రామీణ ఎస్సై హనమంతప్ప తమ సిబ్బందితో దేవస్థానానికి చేరుకొని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Tags :